వరస బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అధికమన్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ లో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న ఎన్టీఆర్ కు దేశవ్యాప్తం గా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “#NTR30 ” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలోని గోపాలపురం గ్రామ పరిధిలోని ఆరున్నర ఎకరాల భూమిలో ఎన్టీఆర్ ఫామ్ హౌజ్ ను నిర్మించిన విషయం తెలిసిందే. ఆ ఫామ్ హౌస్ కి ‘బృందావనం’ అని పేరు పెట్టి ఎన్టీఆర్ , తన సతీమణి లక్ష్మీ ప్రణతికి బర్త్ డేకు గిఫ్ట్ గా ఇచ్చారు. తాజాగా ఆ ఫౌమ్ హౌజ్ లోనే ఎన్టీఆర్ , తన సతీమణి లక్ష్మి ప్రణతితో కబుర్లు చెప్పుకుంటూ.. సరదగా టైమ్ స్పెండ్ చేశారు. తన భార్య తో ముచ్చట్లు చెప్పుకుంటున్న ఫొటో ను ఎన్టీఆర్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది. ఇలాంటి రేర్ ఫొటో ను ఎన్టీఆర్ తాజాగా అభిమానులతో పంచుకోవడం పట్ల ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: