‘ హిట్ 2’ ఫైనల్ షెడ్యూల్ అప్ డేట్

Hit 2 Movie Final Schedule Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Hit 2,Hit 2 Movie,Hit 2 Telugu Movie,Hit 2 Movie Shooting Updates,Hit 2 Movie Final Schedule Latest Updates,Adivi Sesh Hit 2 MOvie Latest Updates, Hit 2 Movie Latest News,Adivi Sesh Hit 2 Movie Latest Shooting Updates,Adivi Sesh Upcoming Movies,Adivi Sesh New Movie Updates,Adivi Sesh latest Movie Updates

శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన సినిమా హిట్. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక మొదటి పార్ట్ లో విశ్వక్ సేన్ నటించగా హిట్ 2 లో అడివి శేష్ నటిస్తున్నాడు. ఈసారి ‘హిట్ 2’ సినిమా ఆంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో సాగే క్రైమ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టారు. దాదాపు చివరి దశకు కూడా వచ్చేసింది. ఇక ఇన్ని రోజులు మేజర్ తో బిజీగా ఉండటంతో ఈసినిమాకు బ్రేక్ పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు అడివిశేష్ హిట్ 2 కోసం రెడీ అవుతున్నాడు. ఈనేపథ్యంలో ఈసినిమా షూటింగ్ గురించి అప్ డేట్ ఇచ్చాడు. తన ట్విట్టర్ ద్వారా.. ముందుగా మేజర్ సినిమాను ఇంత సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్.. ఇక మేజర్ సినిమా రిలీజ్ అయిన వెంటనే హిట్ 2 ను స్టార్ట్ చేద్దామనుకున్నాను.. అయితే మేజర్ సినిమా రిలీజ్ వరకూ కంటిన్యూగా ఈసినిమా కోసం వర్క్ చేయడంతో ఫిజికల్ గా అలానే మెంటల్ గా చాలా అలసిపోయాను.. అందుకే న్యాచురల్ స్టార్ నాని గారిని అలానే డైరెక్టర్ శైలేష్ కొలనుని కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటానని అడిగాను.. వాళ్లు ఒప్పుకోవడంతో కాస్త బ్రేక్ తీసుకున్నాను.. వచ్చే నెల నుండి ఫైనల్ షెడ్యూల్ ను స్టార్ట్ చేస్తానని.. రిలీజ్ డేట్ ను కూడా త్వరలోనే చెబుతామని తెలియచేశాడు.

కాగా ఈసినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌద‌రి న‌టించ‌నుంది. నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని ఈసినిమాను నిర్మిస్తున్నారు. మణికందన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి సంగీతాన్ని అందించనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + eleven =