హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 “మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.“సలార్” మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రం “సలార్”. ఈ మూవీ లో ఫస్ట్ టైమ్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా నటిస్తూ ప్రేక్షకులను అలరించనున్నారు.మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్ర లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా “సలార్” మూవీ కొత్త షెడ్యూల్ ఈ రోజు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం అయ్యింది. ఈ షూటింగ్ లో హీరో ప్రభాస్ , హీరోయిన్ శృతి హాసన్ సెట్స్ లో జాయిన్ అయ్యారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఓ కీలక యాక్షన్ ఎపిసోడ్‌ని తెరకెక్కిస్తున్నారు. ఈభారీ యాక్షన్ ఎపిసోడ్ కై 4.6కె రిజల్యూషన్‌తో కూడిన అలెక్స్ సూపర్ 35 ఎంఎం కెమెరాని వినియోగిస్తుండడం విశేషం. ఈ కెమెరా తో విజువల్స్ అద్భుతంగా తెరకెక్కుతాయని సమాచారం.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























