ఆదిపురుష్’.. ఫైనల్ స్టేజ్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు..!

Prabhas Adipurush Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Adipurush,Adipurush Movie,Adipurush Telugu Movie,Adipurush latest Movie Updates,Adipurush Movie Updates,Adipurush New Movie Updates, Prabhas Adipurush Movie,Rebel Star Prabhas Adipurush Movie latest Updates,Pan Indian Star Prabhas Adipurush Movie latest Updates, Prabhas Upcoming Movie Adipurush,Prabhas Movies,Prabhas Upcoming Movies,Prabhas Movies in 2022,Prabhas New Movies in 2022 & 2023

బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఎలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలు జయాపజయాలను పక్కన పెడితే ప్రభాస్ కటౌట్ కే భారీ బడ్జెట్ సినిమాలు తీయడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ఇండియా సినిమాలే. అందులో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. అయితే ఈసినిమా షూటింగ్ కు పట్టే టైమ్ కంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులకే ఎక్కువ టైమ్ పట్టనున్న విషయం కూడా ఇప్పటికే తెలిసిందే. 3డీ నేపథ్యంలో భారీ గ్రాఫిక్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు కాబట్టి చాలా సమయం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కే పడుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫైనల్ స్టేజ్ లోకి వచ్చేసినట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఈసినిమాలో నటీ నటులు డబ్బింగ్ ను మొదలుపెట్టనున్నారట.

కాగా 3డీ విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈసినిమాలో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 17 =