యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ “సమ్మతమే”. చాందిని చౌదరి కథానాయికగా నటిస్తోంది. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మించిన ఈసినిమా గ్రాండ్ గా రిలీజ్ అయింది. మరి ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది.. ఈసినిమా హిట్ అయిందా లేదా అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి, గోపరాజు రమణ,శివ నారాయణ
డైరెక్టర్.. గోపీనాథ్ రెడ్డి
బ్యానర్స్.. యూజీ ప్రొడక్షన్స్
నిర్మాతలు.. కంకణాల ప్రవీణ
సంగీతం.. శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫి.. సతీష్ రెడ్డి
కథ..
కృష్ణ(కిరణ్ అబ్బవరం)తల్లి చిన్నప్పుడే చనిపోతుంది. తల్లి లేని లోటు ఇంట్లో స్పష్టంగా కనిపించడంతో తనకు పెళ్లిచేయమంటాడు. అది విని షాకైన నాన్న.. నువ్వు జాబ్ చేసి, డబ్బు సంపాదించి మంచి పొజిషన్ లో ఉన్నాక పెళ్లి చేస్తానంటాడు. దాంతో తండ్రి మాట మేరకు మంచి జాబ్ ను సంపాదించి సెటిల్ అవుతాడు. ఇక పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఓ పద్ధతైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అందుకోసం పెళ్లి చూపులకు వెళ్తాడు. అంతకు ముందే ఓ ఫంక్షన్‌లో ఊహించని విధంగా శాన్వి(చాందిని చౌదరి)అనే అమ్మాయి తనని పరిచయం చేసుకుని బాయ్ ఫ్రెండ్ అని చెప్పి షాకిస్తుంది. ఆ షాక్‌లో ఉన్న అతను నెక్ట్స్ డే పెళ్లి చూపులకు ఆ అమ్మాయి ఇంటికే వెళ్తాడు. దీంతో తొలి చూపులోనే ఆమె ప్రేమలో పడతాడు. కానీ ఆమె కి అప్పటికే లవ్ బ్రేకప్ అయ్యిందని తెలిసి రిజెక్ట్ చేస్తాడు. ఆతరువాత ఎన్నో పెళ్లి చూపులు చూస్తాడు. కానీ ఎవరిని చూసినా శాన్వినే గుర్తొస్తుంది. దీంతో తనని ప్రేమిస్తున్నాని అర్థంచేసుకున్న కృష్ణ తనకు దగ్గరవుతాడు. కానీ శాన్వి సిటీ కల్చర్ కృష్ణకి నచ్చదు. చాలా సార్లు తనకు చెప్పాలని చూస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణ ఏం చేశాడు.. అతని కోసం మారిందా? ఆమె కోసం అతను మారాడా? వీరి ప్రేమ కథ ఎలా ముగిసింది అన్నది మిగిలిన కథ..
విశ్లేషణ
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజా వారు రాణి వారు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కిరణ్ తన నటనతో అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో మంచి హిట్ ను అందుకోవడమే కాకుండా వరుస సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నాడు. పెద్ద పెద్ద బ్యానర్లలో సైతం కిరణ్ సినిమా అవకాశాలు రావడం విశేషం. దీనికి కారణం కూడా లేకపోలేదు. పక్కింటి కుర్రాడి ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు కాబట్టే.. అలాంటి వారికి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు కాబట్టే నిర్మాతలు కూడా వారితో సినిమాలు చేయడానికి ముందుకొస్తుంటారు. అందుకే కిరణ్ తో కూడా చేయడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక ఈసినిమాలో కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు కిరణ్. కృష్ణ పాత్రలో తను ఒదిగిపోయాడు. తను చేసుకోబోయే అమ్మాయి తనకు నచ్చినట్టుగానే ఉండాలనుకోవడం.. అమ్మాయిని ఆంక్షల్లో పెట్టాలని చూసే రోల్ లో కిరణ్ అబ్బవరం బాగానే నటించాడు. ఇక చాందిని చౌదరి అయితే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. సిటీలో పెరిగిన అమ్మాయిగా మోడ్రన్ కల్చర్ అమ్మాయిగా చక్కగా నటించింది. మందు కొట్టడం, దమ్ము కొట్టే సీన్లలో కూడా బాగానే చేసింది. ఇప్పటివరకూ ఇంత మోడ్రన్ పాత్రలో చాందిని నటించలేదు. దీంతో తనలోని మరో యాంగిల్ ను ఈసినిమా ద్వారా చూపించింది. గోపరాజు రమణ, శివ నారాయణ, సప్తగిరి, అన్నపూర్ణమ్మ ఇలా అందరూ తమ పరిధి మేరకు నటించేశారు.
ప్రస్తుతం ఉన్న రోజులను బట్టే వివాహాలు, వివాహ బంధాలు నిలుస్తున్నాయి. ఇక అలాంటి పాయింట్ మీదే ఈకథను తీసుకున్నాడు గోపీనాథ్. నేటి యువత ఎలా ఉంటున్నారు.. అమ్మాయిలు ఎలా ఉంటున్నారు, వారికి తగ్గట్టుగా అబ్బాయిలు మారాలని.. ఇంకా ఒకరి ఆలోచనలను మరొకరు అలానే ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవిస్తూ ముందుకు సాగాలనే చెప్పే ప్రయత్నం చేశాడు. మన జీవితంలోకి వచ్చే వాళ్లపై కూడా మన అభిప్రాయాలు, షరతులు విధిండకూడదని.. వాళ్లని వాళ్లలా యాక్సెప్ట్ చేయాలనేదే థీమ్ తో తెరకెక్కించి బాగానే ఎంటర్ టైన్ చేశాడు.
ఇక సాంకేతిక విభాగానికి వస్తే ఈసినిమాలో దాదాపు ఏడు పాటలు ఉన్నాయి. పాటలు పర్వాలేదనిపించినా నేపద్య సంగీతం మాత్రం బాగుంది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అన్నీ కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా యూత్ కు కనెక్ట్ అయ్యే సినిమా అని చెప్పొచ్చు. లవ్ స్టోరీస్ ఇష్టపడే వారు కూాడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయోచ్చు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: