అకీరా కు ‘మేజర్’ థాంక్స్..!

Adivi Sesh Thanks Akira Nandan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Adivi Sesh,Hero Adivi Sesh,Adivi Sesh Major Hero,Major Hero Adivi Sesh,Adivi Sesh Thanks Akira Nandan,Adivi Sesh Thanks to Pawan Kalyan Son Akira Nandan, Power Star pawan Kalyan Son Akira Nandan,Major Movie Song By Akira Nandan,Hrudayama Song From Major Movie,Akira Nandan Played Hrudayama SOng From Major Movie, Akira Nandan Keyboard Player,Akira Nandan New Song Played on Keyboard Shared in SOcial Media,Akira Nandan Keyboard SOng From Major Movie Goes Viral in SOcial Media

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ మాత్రం ఇప్పటినుండే జూనియర్ పవర్ స్టార్ గా తన టాలెంట్స్ ను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నాడు. మల్టీటాలెంటెడ్‌గా పవర్ స్టార్ ఫ్యాన్స్ మనసులను గెలుచుకుంటున్నాడు. అకీరా ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్ ను నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. దానితో పాటు సంగీతంతో కూడా అకీరా టాక్ ఆఫ్ ద టౌన్ అవుతున్నాడు. గతంలో దోస్తీ పాటకు పీయానోతో ట్యూన్ కట్టి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. తన స్కూల్ గ్రాడ్యుయేషన్‌ సందర్భంగా దోస్తీ సాంగ్‌ను పియానోలో వాయించాడు అకీరా. ఆ తరువాత సర్కారు వారి పాట సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ కళావతి పాటకు కూడా ట్యూన్ కట్టి ప్రశంసలు అందుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరోసారి మేజర్ లోని పాటను కంపోజ్ చేశాడు. ‘మేజర్’ సినిమాలో హృదయమా.. అంటూ సాగే సాంగ్‌ను కీబోర్డుతో కంపోజ్ చేసి అందరి హృదయాలను కదిలించాడు. హీరో అడివి శేష్ కోసం ఈ సాంగ్‌ను కంపోజ్ చేసి పంపించాడు అకీరా నందన్. ఇక ఈపాటను తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ థాంక్స్ కూడా చెప్పాడు అడివి శేష్. హార్ట్ ఫుల్ గా ఉంది. లవ్ యూ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అంతేకాక మేజర్ చిత్రానికి సంగీతం అందించిన శ్రీ చరణ్ పాకాల ను ట్యాగ్ చేస్తూ, ఒకసారి చూడండి అంటూ కూడా సజస్ట్ చేశాడు.

కాగా శశి కిరణ్ దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా మేజర్ సినిమా వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జూన్ 3న ఆడియన్స్ ముందుకు వచ్చి బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ రియల్ స్టోరీని బిగ్ స్క్రీన్‌పై చూసి సామాన్యుల దగ్గర నుండి సినీ సెలబ్రిటీల వరకూ అందరూ సెల్యూట్ చేస్తున్నారు. ఈ సినిమా అడివి శేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here