టాలీవుడ్ హీరోలు విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన క్రేజీ మల్టీస్టారర్ ఎఫ్2. మూడు సంవత్సరాల క్రితం వచ్చిన ఎఫ్2 మంచి విజయం సాధించింది. అదే జోష్ లో సేమ్ టీమ్ తో ఎఫ్3 తీశాడు అనిల్ రావిపూడి. ఇక అనుకున్నట్టే ఈసినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ విజయం అందుకుంది. ఎఫ్3 టీమ్ అంతా కలిసి ప్రేక్షకులకు నవ్వుల విందు అందించారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఈసినిమాకు బాగా కనెక్ట్ తో సినిమా కలెక్షన్స్ కు బాగా కలిసొచ్చింది. మే 27న ఈసినిమా రిలీజ్ అవ్వగా రిలీజ్ అయిన పది రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఈసినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన తమన్నా మాత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎక్కడా కనపడలేదు. ఇంకా సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో కూడా ఎక్కడా కనబడలేదు. దీంతో పలు వార్తలు తెరపైకి వచ్చాయి. తమన్నాకు అనిల్ రావిపూడికి మధ్య గొడవ జరిగిందంటూ వార్తలు వినిపించాయి. ఇక తాజాగా ఈవార్తలపై అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ రావిపూడిని దీని గురించి అడుగగా.. గొడవ లాంటిది ఏం లేదు.. ఎక్కువమంది ఆర్టిస్టులతో పని చేసేటప్పుడు .. కాస్త వెనకా ముందు వచ్చే ఆర్టిస్టుల వలన అనుకోని ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి. అందువలన తమన్నా తన వర్క్ ను కొనసాగించవలసి వచ్చింది. ఆ కారణంగా అక్కడి వాతావరణం రెండు రోజుల పాటు కాస్త హీటెక్కింది. ఎక్కువమంది మంది ఆర్టిస్టుల కాంబినేషన్ కావడం వలన అలా చేయక తప్పలేదు. అలాంటివి కామన్ గా జరుగుతూనే ఉంటాయి.. నేను కూడా వాటిని పట్టించుకోను.. అందరినీ కలుపుకుపోతూనే ఉంటాను. తను కూడా ఆ విషయాన్ని అంతటితో వదిలేసింది. తను ప్రమోషన్స్ కి రాకపోవడానికి అది కారణం తను వేరే పనులతో బిజీగా ఉండటమే అని క్లారిటీ ఇచ్చాడు.
కాగా ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మించారు. సోనాల్ చౌహాన్, మురళీ శర్మ, రాజేంద్రప్రసాద్, అలీ, సునీల్ ఇతర పాత్రల్లో నటించారు. మరోవైపు ఈసినిమా ఓటీటీ రిలీజ్ పై కూడా క్లారిటీ ఇచ్చారు. ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తుందని క్లారిటీ ఇచ్చారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: