‘హ్యాపీ బర్త్ డే’ టీజర్ రిలీజ్

Happy Birthday Teaser Released,Lavanya Tripathi’s Happy Birthday Movie Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Lavanya Tripathi,Actress Lavanya Tripathi,Lavanya Tripathi Movie Updates,Lavanya Tripathi latest Movie Updates,Lavanya Tripathi Upcoming Movies,Lavanya Tripathi New Movie Updates, Lavanya Tripathi latest Movie Updates,Lavanya Tripathi Happy Birthday Movie,Lavanya Tripathi Happy Birthday Movie Teaser Released,Lavanya Tripathi Happy Birthday Movie Teaser Out Now, Lavanya Tripathi Happy Birthday Movie,Lavanya Tripathi Happy Birthday Telugu Movie,Lavanya Tripathi Upcoming Movie Happy Birthday Teaser Out Now,Happy Birthday Teaser Out Now,Happy Birthday Teaser Released, Happy Birthday Teaser

అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నా లావణ్యకు మాత్రం సరైన విజయాలు అందట్లేదు. అయినా కూడా ఏమాత్రం నిరాశ చెందకుండా కెరీర్ ను కొనసాగిస్తూనే ఉంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తుంది. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా హ్యాపీ బర్త్ డే. మత్తు వదలరా తో సాలిడ్ హిట్ అందుకున్న దర్శకుడు రితేష్ రానా ఈసినిమాను డైరక్ట్ చేస్తున్నాడు. ఈసినిమా జులై 15న రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ఇప్పటి నుండే బజ్ క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా టీజర్ ను నేడు రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక టీజ‌ర్‌ను గ‌మనిస్తే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌గా సినిమా ఉండ‌బోతుంద‌ని తెలుస్తుంది. ఆయుధాల చ‌ట్టం అంటే ఏంటి సుయోధ‌న‌.. ఇంటింటికి గ‌న్, ఎదురులేని ఫ‌న్’ అంటూ టీజ‌ర్ మొద‌లవ్వగా.. తాను టెన్త్ ఫెయిల్ అయిండోచ్చు.. కానీ గన్ బిల్లు మాత్రం పాస్ చేయించి తీరుతా అంటూ వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. నో గన్.. నో ఎంట్రీ అంటూ గన్ కల్చర్‌ను చూపించారు. ఆయుధాలను మెయిన్‌గా తీసుకుని కామెడీని మిక్స్ చేసి ఈ మూవీని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. మరోసారి రితేష్ హిట్ కొట్టే అవకాశాలు బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది.

ఇంకా ఈసినిమాలో నరేష్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ – క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ల పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తుండగా సురేష్ సరంగం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =