లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో అర్జున్ , మధుబాల జంటగా తెరకెక్కిన జెంటిల్ మెన్ సినిమా 1993వ సంవత్సరంలో రిలీజ్ అయి ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో తెలిసిందే కదా. ఈసినిమాతోనే శంకర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈసినిమాను ఏ ఆర్ ఎస్ ఫిల్మ్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై కె. టి. కుంజుమోన్ ఈసినిమాను నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు చాలా కాలం తరువాత కుంజుమోన్ జెంటిల్ మెన్ 2 ను తెరకెక్కించడానికి రెడీ అవుతున్న సంగతితెలిసిందే. ఈనేపథ్యంలోనే ఈసినిమాలో నటించే నటీనటులను ఒక్కొక్కరిగా ఎంపిక చేస్తూ అధికారికంగా ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమాలో నటించే హీరోయిన్లను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. మాలీవుడ్ బ్యూటీ నయనతార చక్రవర్తి, మరో హీరోయిన్ గా యంగ్ నటి ప్రియా లాల్ ని ఎంపికచేశారు. ఇక ఇప్పుడు ఈసినిమాకు డైరెక్టర్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈవిషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గోకుల్ కృష్ణ అనే డైరెక్టర్ ను ఈసినిమాను డైరెక్ట్ చేయడానికి ఫిక్స్ చేశారు.
కాగా ఈసినిమాను పాన్ ఇండియా లెవల్లో నిర్మించనున్నారు కుంజుమోన్. ఇక ఈసినిమాకు ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిచనున్నాడు. ఈ విషయాన్ని ఇటీవలే అధికారికంగా తెలిపారు చిత్రయూనిట్. ఇక ఈసినిమాకు సంబంధించిన విషయాలను త్వరలోనే తెెలియచేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: