కమెడియన్గా కెరీర్ ప్రారంభించిన సునీల్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ కమెడియన్ గా మారారు. సక్సెస్ ఫుల్ కమెడియన్ గా కొనసాగుతున్న సునీల్ హీరోగా మారి “అందాల రాముడు ” , “మర్యాద రామన్న “వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. “కలర్ ఫొటో”, “పుష్ప:ది రైజ్ ” సినిమాలతో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ సునీల్ అందరినీ ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “F3 “మూవీ లో సునీల్ ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్లో నటించారు. మే 27 వతేది రిలీజ్ కానున్న ఆ మూవీ పై సునీల్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. “పుష్ప” మూవీ తరువాత వేరే భాషల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయని సునీల్ తెలిపారు.తమిళ్, హిందీ భాషల నుంచి ఎక్కువగా ఆఫర్స్ వస్తున్నాయనీ , తమిళ్ లో ఆల్రెడీ 2 ప్రాజెక్టులు ఓకే చేశాననీ , . ఆ రెండు సినిమాల్లో విలన్ పాత్రలేననీ , . హిందీ నుంచి కూడా 2 ప్రాజెక్టులొచ్చాయనీ , . అందులో ఒకటి విలన్ పాత్ర. ఇంకో సినిమాలో కమెడియన్ పాత్ర అనీ సునీల్ చెప్పారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.