విశాల్ ‘లాఠీ’ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Vishals Lathi Movie Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Lathi,Lathi Movie,Lathi Movie Updates,Lathi Movie latest Updates,Hero Vishal,Vishal Latest Movie Lathi,Vishal Lathi Movie Release Date,Vishal Lathi Movie updates, Vishal Lathi Movie Release Date Announced,Vishal Lathi Movie Release Date Fixed,Vishal Lathi Movie Release Date Confirmed,Vishal Lathi Movie Release Date Officially Announced

విశాల్ కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ఆ మధ్య వరుసగా ఫ్లాప్స్ తో సతమతమవుతున్న విశాల్ ‘డిటెక్టివ్‌’, ‘అభిమ‌న్యుడు’ వంటి సినిమాలతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు విశాల్. అందులో ఒక సినిమానే ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న లాఠీ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈసినిమాకు సంబంధించి ఇప్పటి వరకూ ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ చేశారు చిత్రబృందం. ఈ చిత్రంలో విశాల్ పోలీస్ అధికారిగా న‌టించ‌నున్నాడు. ఇక ఇన్ని రోజులు ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పుడు తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఆగష్ట్ 12న ఈసినిమాను విడుద‌ల చేస్తున్నట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అంతేకాదు తెలుగుతో పాటు ఈసినిమాను త‌మిళంతో పాటు, తెలుగు, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో కూడా రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ కు కూడా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. తాడును నోటితో పట్టుకుని.. ఓ వైపు రక్తం కారుతున్నా.. మరో కన్నుకు గాయమైనా.. విశాల్ నవ్వుతూ కనిపించాడు. ఈ పోస్టర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది

కాగా రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణ నందా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈసినిమాలో హీరోయిన్ గా సునయన నటిస్తుంది. బాలసుబ్రమణ్యన్ సినిమాటోగ్రాఫర్ గా, సామ్ సిఎస్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 3 =