సందీప్-వి.ఐ ఆనంద్ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్..!

Sundeep kishan VI Anand movie first look title revealed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sundeep kishan,Hero Sundeep kishan,Sundeep kishan Movie Updates,Sundeep kishan Movies,Sundeep kishan latest Movie Updates,Sundeep kishan Upcoming Movie Updates, Sundeep kishan VI Anand Movie,Sundeep kishan VI Anand Movie First Look Out Now,Sundeep kishan VI Anand Movie First Look Released,Sundeep kishan VI Anand Movie First Look Released now, VI Anand Movie First Look Title Revealed,VI Anand Movie Title Revealed,Sundeep kishan VI Anand movie title revealed

ఒక సినిమా అయిపోయిన వెంటనే మరో సినిమాను లైన్ లో పెడుతూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు సందీప్ కిషన్. ఇటీవలే గల్లీ రౌడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్ కిషన్ కు ఈసినిమా సరైన విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్స్ట్ పై దృష్టి పెట్టాడు సందీప్. దీనిలో భాగంగానే డిఫరెంట్ కథలతో వచ్చేస్తున్నాడు. ఈసారి ఎలాగైనా సరే మంచి హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. ప్రస్తుతం రంజిత్ దర్శకత్వంలో మైఖేల్ అనే సినిమాను అలానే వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో ఇంకా పలు సినిమాలు సినిమాలు లైన్ లో ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా నేడు సందీప్ కిషన్ పుట్టిన రోజు సందర్భంగా తన సనిమాల నుండి అప్ డేట్స్ వరుసగా వస్తున్నాయి. ఇప్పటికే మైఖేల్ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. సిక్స్ ప్యాక్ తో ఉన్న సందీప్ కిషన్ లుక్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా వి.ఐ ఆనంద్ ఈసినిమా ఫస్ట్ లుక్ ను టైటిల్ ను రిలీజ్ చేశారు. ఊరు పేరు భైవర కోన అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు.

కాగా సూప‌ర్ న్యాచురల్ ఫాంటసీ జోన‌ర్‌లో తెర‌కెక్కుతున్న ఈసినిమాను హాస్య మూవీస్‌ పతాకంపై రాజేష్‌ దండ నిర్మిస్తున్నారు. బాలాజీ గుట్ట సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో ‘టైగర్’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఆరేళ్ల తరువాత మళ్లీ కలిసి చేస్తున్నారు. మరి ఈసినిమా వీరిద్దరి మంచి హిట్ ఇస్తుందేమో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + eight =