‘రంగ రంగ వైభవంగా’.. ‘కొత్తగా లేదేంటి’ సాంగ్ రిలీజ్..!

Kothaga Ledenti Song From Ranga Ranga Vaibhavanga Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ranga Ranga Vaibhavanga,Ranga Ranga Vaibhavanga Movie,Ranga Ranga Vaibhavanga Telugu Movie,Ranga Ranga Vaibhavanga Movie Songs,Ranga Ranga Vaibhavanga Movie Updates, Ranga Ranga Vaibhavanga Song Updates,Ranga Ranga Vaibhavanga latest Song Released,Ranga Ranga Vaibhavanga Latest New Song Kothaga Ledenti Song, Kothaga Ledenti Song Released From Movie Ranga Ranga Vaibhavanga,Vaishnav Tej upcoming Movie Ranga Ranga Vaibhavanga Song Released,Vaishnav Tej New Movie Updates,Vaishnav Tej Latest Movie Updates, Vaishnav Tej Kothaga Ledenti Song Released From Ranga Ranga Vaibhavanga Movie

మెగా కాంపౌండ్ నుండి సినీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకోవడమే కాదు నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్న నటుడు వైష్ణవ్ తేజ్. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన కొండపొలం సినిమాతో కూడా మరోసారి తనను తాను నిరూపించుకున్నాడు. రెండు సినిమాల్లో డీ గ్లామర్ రోల్స్ లో నటించిన వైష్ణవ్ తేజ్ ఇప్పుడు లవర్ బాయ్ పాత్రలోకి వచ్చేశాడు. తమిళంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా రంగ రంగ వైభవంగా. ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మరోవైపు ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇటీవల విడుద‌లైన ఈ మూవీ టైటిల్ టీజ‌ర్‌, పాట‌కు ఆడియెన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి డ్యూయెట్ సాంగ్ ‘కొత్తగా లేదేంటి..’ అంటూ సాగే ల‌వ్‌ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. అర్మాన్ మాలిక్‌, హ‌రి ప్రియ పాడిన ఈ పాట‌ను శ్రీమ‌ణి రాశారు. ఈ సాంగ్ ప్రేమికుల‌కు క‌నెక్ట్ అయ్యేలా రాక్ స్టార్‌ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతంలో కంపోజ్ చేసినట్లు అనిపిస్తుంది.

కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో.. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. శామ్ ద‌త్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.