‘RC 15’ పై ఫోకస్ మార్చిన చరణ్..!

Ram Charan Completely Focussing on RC15,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ram Charan,Mega Power Star Ram Charan,Ram Charan latest Movie Updates,Ram Charan New Movie Updates,Ram Charan Pan Indian Movies,Ram Charan Upcoming Movies, Ram Charan Next Projects,Ram Charan RC15 Movie Updates,Ram charan latest shooting Udpates,Ram Charan Shoot Updates,Ram Charan Movie In 2022,Upcomig Movies of Ram Chrana in 2022, Ram Charan RC15 Movie Shooting Updates,Ram Charan Upcoming Movie RC15,RC15 latest Updates,RC15 Movie Latest Updates,Mega Star Ram Charan RC15 latest Movie Updates

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. రాజమౌళి సినిమా కాబట్టి హిట్ అవుతుందన్న నమ్మకం అందరికీ ఉంది. అయితే అది ఒక కారణమైనా రామ్ చరణ్ మాత్రం తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సౌత్ హీరో కాబట్టి సౌత్ లో ఎలాగూ చరణ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది.. అయితే ఆర్ఆర్ఆర్ తో మాత్రం నార్త్ లో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకోగలిగాడు.ఇక రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన ఆచార్య సినిమాలో కూడా తన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే రామ్ చరణ్ పాత్రకు, నటనకు ప్రశంసలు దక్కాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు ప్రస్తుతం రామ్ చరణ్ తన ఫోకస్ ను మళ్లీ శంకర్ సినిమాపై షిప్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది. మధ్యలో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్, ఆచార్య ప్రమోషన్స్ వల్ల ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఇక రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు అయిపోయాయి. దీంతో మళ్లీ RC 15 షూటింగ్ లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది. మే ఫస్ట్ వీక్ నుండి ఈసినిమా కొత్త షెడ్యూల్ ను మళ్లీ స్టార్ట్ చేయనున్నాడట చరణ్. ఈ షెడ్యూల్ వైజాగ్ లో స్టార్ట్ చేయనున్నారట. ఇక షూటింగ్ లో చరణ్ కూడా కియారా అద్వాని కూడా పాల్గొననున్నట్టు తెలుస్తుంది.

కాగా దిల్ రాజుకు ఈసినిమా 50వ సినిమా కావడంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈసినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాలో చరణ్ పొలిటీషియన్ గా కనిపించనున్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 1 =