‘సర్కారు వారి పాట’ మూవీ ‘పోకిరి’ ని క్రాస్ చేస్తుంది..!

Marthand K Venkatesh About Sarkaru Vaari Paata Movie Result,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Marthand K Venkatesh,Editor Marthand K Venkatesh About Sarkaru Vaari paata Movie,Editor Marthand K Venkatesh For Sarkaru Vaari paata Movie,Sarkaru Vaari Paata Movie Editor Marthand K Venkatesh, Marthand K Venkatesh about Mahesh Babu Movie Sarkaru Vaari paata,Marthand K Venkatesh Says it will Cross Pokiri Movie,Mahesh Babu Upcoming Movie Sarkaru Vaari paata,Sarkaru Vaari paata Movie Updates, Sarkaru Vaari Paata Movie Results,Sarkaru Vaari Paata Movie Promotions

పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా మే 12వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ అప్పుడే ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసేసింది. ఇప్పటికే ఈ చిత్రయూనిట్ కు సంబంధించిన వారు ఒక్కొక్కరూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇప్పటికే ఆర్ట్ డైరెక్టర్ గా చేసిన ఏఎస్ ప్రకాష్ ఈసినిమా గురించి పలు ఆసక్తిక విషయాలు తెలియచేశారు. ఇప్పుడు ఎడిటర్ మార్తాండ్ కె ప్రకాష్ కూడా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాలో ముఖ్యంగా మహేష్ లుక్ కు అందరూ ఫిదా అవుతున్న సంగతి తెలిసిందే కదా. శ్రీమంతుడు, మహర్షి, భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు సినిమాల్లో దాదాపు మహేష్ ఒక స్టైల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈసినిమాలో మాత్రం తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. పోకిరి రోజులను గుర్తుచేస్తున్నాడు. మరి పోకిరి సినిమా టైమ్ లో మహేష్ లుక్ కు ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ఇప్పుడు మరోసారి అల్ట్రా పాష్ లుక్ లోకి వచ్చి మరోసారి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వనున్నాడు. తాజాగా మార్తాండ్ కె వెంకటేష్ కూడా ఇదే విషయాన్ని తెలుపుతున్నాడు. ఇప్పటి వరకూ మహేష్ చేసిన సినిమాల్లో ఇదే బెస్ట్ లుక్ అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు పోకిరి సినిమాకు నేను ఎడిటర్ గా చేశా. పోకిరి రష్ చూసినప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పా. సర్కారు వారి పాట ఫస్ట్ రష్ చూసిన తర్వాత పోకిరిని క్రాస్ చేస్తామని చెప్పా. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్ ట్రాక్ లో తెగ నవ్వుకున్నా. మహేష్ బాబు ఫ్యాన్స్ కి సర్కారు వారి పాట ఒక పెద్ద పండగలా వుంటుందని తెలిపాడు.

కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, సముద్రఖని కూడా ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా.. ఆర్ మధి సినిమాటోగ్రఫీ, ఏ ఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.