‘కళావతి’ ఖాతాలో 150 మిలియన్..!

Kalavathi Song from Sarkaru Vaari Paata Crosses 150 Million Plus Views

టాలీవుడ్ లో ప్రస్తుతం థమన్ హవా ఎంత నడుస్తుందో చూస్తూనే ఉన్నాం. తమ పాటలతోనే సినిమాలపై అంచనాలను పెంచేయడమే కాదు.. సినిమాను సగం హిట్ కూడా చేసేస్తున్నాడు. అల వైకుంఠపురం నుండి మొదలైన తన రికార్డుల పర్వం ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. తను మ్యూజిక్ అందిస్తున్న అన్ని సినిమాల్లో పాటలు దాదాపు శ్రోతలను బాగా అలరిస్తున్నాయి. అంతేకాదు మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంటున్నాయి. ఇక సర్కారు వారి పాట సినిమా పాటలు కూడా ఓ రేంజ్ లో రెస్పాన్స్ ను దక్కించుకున్న సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటి వరకూ ఈసినిమా నుండి మూడు పాటలు రిలీజ్ అయ్యాయి. మొదటి పాటగా రిలీజ్ అయిన కళావతి పాట ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే. ఈ సాంగ్ యూట్యూబ్ లోనే కాకుండా పలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది. సామాన్యుల దగ్గర నుండి సినీ సెలబ్రిటీల వరకూ అందరూ ఆ పాటకు స్టెప్పులేస్తూ వీడియోలు చేశారు. ఇప్పుడు తాజాగా మరో రికార్డును సొంతం చేసుకుంది కళావతి పాట. యూట్యూబ్ లో 150 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది ఈపాట. తక్కువ టైం లో 150 మిలియన్ల వ్యూస్ ను రాబట్టిన సాంగ్ గా కళావతి రికార్డు సృష్టించింది.

కాగా పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా సర్కారు వారి పాట సినిమా వస్తుంది. ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇక బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. మే 12న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.