ఆశిష్ ‘సెల్ఫిష్’ మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్

Asish Reddys Selfish Movie Movie Motion Poster Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Selfish,Selfish Movie,Selfish Telugu movie,Selfish Movie Updates,Selfish latest Movie Updates,Selfish New Movie,Selfish movie Latest News,Asish Reddys Selfish Movie Motion Poster, Asish Reddys Selfish Movie Motion Poster out Now,Selfish Movie Movie Motion Poster Released,Selfish Movie Movie Motion Poster Out Now,Selfish Movie Movie Motion Poster updates

దిల్ రాజు వారసుడిగా రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు ఆశిష్ రెడ్డి. కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈసినిమా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకట్టుకున్నాడు ఆశిష్ రెడ్డి. తన డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్స్ లతో అందరినీ మెప్పించాడు. హీరోకి కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఆశిష్ రెడ్డికి ఉన్నాయన్న ప్రశంసలు అయితే దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు తన రెండో సినిమాను కూడా మొదలుపెట్టేస్తున్నాడు. రెండో సినిమాకు సంబంధించిన ప్రకటన అయితే ఎప్పుడో వచ్చేసింది. ఈసినిమాకు సెల్ఫిష్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసి ఇప్పటికే ప్రకటించారు కూడా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా నేడు ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు మేకర్స్. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ క్లాప్ నివ్వగా…దర్శకుడు హరీష్ శంకర్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. ఈసందర్భంగానే ఈసినిమా మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

కాగా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈసినిమాను సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కాశీ ఈసినిమాకు దర్శకత్వం వహించనున్నారు. సుకుమార్ రైటింగ్స్ మరియు దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా మణికందన్ పని చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 1 =