ఇండస్ట్రీలోకి ఎంట్రీ ముందు సైడ్ క్యారెక్టర్లు చేసి.. ఆతరువాత సపోర్టింగ్ రోల్ చేసి.. ఆ తరువాత హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే హిట్ కొట్టి.. ఆ తరువాత కల్ట్ మూవీతో ఇండస్ట్రీలోనే సంచలనాలు క్రియేట్ చేసిన హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి లాంటి సినిమాతో టాలీవుడ్ లో అప్పట్లో టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. ఆ తరువాత కూడా వరుసగా విజయాలు అందుకొని మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం అయితే విజయ్ దేవకొండకు సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం విజయ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నాడు. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తరువాత విజయ్ వెంటనే పూరీతోనే మరో సినిమాను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. పూరీ ఎప్పటినుండో అనుకుంటున్న జనగణమన సినిమానే విజయ్ తో చేయనున్నాడు. ఈసినిమా కోసం ఇప్పటికే తన మేకోవర్ ను కూడా మార్చేశాడు. అయితే ప్రస్తుతం విజయ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈనేపథ్యంలోనే ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. వర్కవుట్స్ చేస్తూ రిలాక్స్ చేస్తున్నాడు. ఇక దీనికి సంబంధించిన గ్లింప్స్ ను కూడా తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. తను వర్కవుట్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ రికవరీ థెరపీ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇంకా బెంచ్ పై కూర్చొని ఎదురుగా ఉన్న లేక్ ను చూస్తూ రిలాక్స్ అవుతున్న ఫొటోను పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: