బీస్ట్, కె.జి.యఫ్ 2 సినిమాల్లో ఏ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు..?

Beast or KGF For which movie you are eagerly waiting

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న పెద్ద పెద్ద సినిమాలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ఫిబ్రవరిలో రాధేశ్యామ్ రిలీజ్ అవ్వగా మార్చిలో ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీటిలో రాధేశ్యామ్ డీసెంట్ హిట్ ను కొట్టగా ఆర్ఆర్ఆర్ ఎంత ప్రభంజనం సృష్టిస్తుందో చూస్తున్నాం. ఇక ఇప్పుడు అందరి ఫోకస్ రెండు సినిమాలపై పడింది. అవే విజయ్ నటిస్తున్న బీస్ట్, యష్ నటిస్తున్న కె.జి.యఫ్ 2. బీస్ట్ ఏప్రిల్ 13న రిలీజ్ అవుతుండగా కె.జి.యఫ్ 2 ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది. రెండు సినిమాలకు ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఉంది. ఇద్దరూ పెద్ద హీరోలు, పెద్ద సినిమాలు పాన్ ఇండియా సినిమాలు అవ్వడంతో బాక్సాఫీస్ వద్ద పోటీ భీభత్సంగా ఉంటుంది అన్న అభిప్రాయాలు మొదలవుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బీస్ట్ సినిమా పాటలు, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా డాక్టర్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి అందరికీ ఆసక్తి పెరిగింది. మరోవైపు కె.జి.యఫ్ చాప్టర్ట్ 1 లాంటి సంచలన సినిమా తరువాత వస్తున్న సినిమా కె.జి.యఫ్ 2. పార్ట్ 1కు కొనసాగింపుగా ఈసినిమా వస్తుంది. మరి ఈసినిమాపై ప్రేక్షకులు ఎంత ఇంట్రెస్ట్ తో ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు సినిమాలపై భారీ అంచనాలే ఉన్నాయి. రెండు సినిమాలు మంచి హైప్ ను క్రియేట్ చేశాయి. ఇక వీటిలో ఏ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి రికార్డులు తిరగరాస్తుందో తెలియాలంటే రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.

రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. మరి ఈ రెండు సినిమాల్లో మీరు ఏ సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో మీ ఓటు ద్వారా తెలియచేయండి.

బీస్ట్, కె.జి.యఫ్ 2 సినిమాల్లో ఏ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =