కొత్తవాళ్లు బన్నీ ని చూసి చాలా నేర్చుకోవాలి..!

Upendra about Icon star Allu Arjun,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Upendra,Hero Upendra,Upendra Upcoming Movies,Upendra latest updates,Upendra Latest News,Upendra New Movies,Upendra About Allo Arjun,Upendra About Stylish Star Allu Arjun, Upendra Says Newcomers should Learn from Allu Arjun,Icon star Allu Arjun,Icon star Allu Arjun Pushpa the Rise,Icon star Allu Arjun Upcoming Movie Pushpa The Rule

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా కోసం తను ఎంత హార్డ్ వర్క్ చేస్తాడో ఇప్పటికే చూశాం. అంతేకాదు బన్నీ హార్డ్ వర్క్ గురించి ఎన్నో సందర్భాల్లో చెప్పిన సెలబ్రిటీలు కూడా ఎంతోమంది ఉన్నారు. కెరీర్ స్టార్టింగ్ నుండి తనను తాను కొత్తగా మలుచుకుంటూ పాత్రల్లో విభిన్నత ఉండేలా చూసుకుంటూ అంచలంచలుగా స్టార్ హీరో వరకూ ఎదిగాడు. ఇక ఇప్పుడు బన్నీ పై ఓ విలక్షణ నటుడు కూడా ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఆ విలక్షణ నటుడు ఎవరో కాదు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఉపేంద్ర ఒకపక్క తను హీరోగా కన్నడలో పలు సినిమాల్లో చేస్తూనే మరోపక్క తెలుగులో కూడా పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక రీసెంట్ గా వరుణ్ తేజ్ నటించిన గని సినిమాలో కూడా ఆయన ఒక కీలక పాత్రలో నటించారు. ఈసినిమా రీసెంట్ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈనేపథ్యంలోనే ఆయన బన్నీ గురించి కూడా మాట్లాడుతూ.. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా చేసేటప్పుడు సెట్లో బన్నీ ఎంతో సరదాగా ఉండేవాడు.. నాకు ఇష్టమైన వంటకాలు ఏమిటో తెలుసుకుని తెప్పించేవారు. ఆ సినిమా పూర్తయ్యేవరకూ నన్ను ఆయన ఒక గిఫ్టులా చూసుకున్నారు. ఆ రోజులను నేను ఇప్పటికీ మరిచిపోలేదు అని తెలిపారు. అంతేకాదు నేను బన్నీని ఒకసారి మీకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది ఏది.. కార్లా? లేదా ట్రిప్స్ కు వెళ్లడమా? అని అడిగాను దానికి ఆయన అవేమీ నాకు సంతోషాన్ని ఇవ్వవు.. షూటింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం.. షూటింగ్ ఉంటే నాకు ఆ రోజు పండగ రోజే అని అన్నాడు. ఆమాట విని నాకు ఆశ్చర్యమేసింది.. ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవాళ్లు మాత్రం బన్నీని చూసి చాలా నేర్చుకోవాలి అంటూ తెలిపారు.

కాగా అల్లు అర్జున్ ఇటీవల డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేసిన సంగతి తెలిసిందే. గతేడాది విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో బన్నీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటించింది. ఇక పుష్ప2 షూటింగ్ ను త్వరలో మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 13 =