ఆర్ఆర్ఆర్ సందడి మళ్లీ మొదలైంది. వాయిదా పడిన తరువాత కొన్నిరోజులు సైలెంట్ గా ఉన్న చిత్రయూనిట్ ఇప్పుడు మళ్లీ ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది. ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ సందడే కనిపిస్తుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలోనే మేకర్స్ భారీ స్థాయిలో ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నారు. 9 ప్రధాన నగరాల్లో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంతేకాదు ఏ నగరంలో ఎప్పుడు ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించనున్నారో ఆ డేట్లను కూడా ఫిక్స్ చేస్తూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మార్చి 18వ తేదీన హైదరాబాదు
మార్చి 18- దుబాయ్
మార్చి 19- బెంగళూరు
మార్చి 20- బరోడా
మార్చి 20- ఢిల్లీ
మార్చి 21- అమృత్ సర్
మార్చి 21- జైపూర్
మార్చి 22- కోల్ కతా
మార్చి 22- వారణాసి
Gear up for a thunderous and exciting week of promotions💥
Come join our MaRRRch… 🙌🏻🤞🏻#RRRTakeOver #RRRMovie
— DVV Entertainment (@DVVMovies) March 17, 2022
కాగా భారత స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవితాల ఆధారంగా తెరకెక్కిన ఫిక్షన్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్’. అల్లూరిగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.