పోల్ గేమ్ : రియల్ లైఫ్ బెస్ట్ జోడీ ?

Vote For The Best Real Life Star Couple,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Real Life Star Couple,Tollywood Realife Star Couple,Mahesh Babu and Namrata Shirodkar,Mahesh Babu Sarkaru Vaari Paata Movie,Mahesh Babu Upcmoing Movies, Mahesh Babu Sarkaru Vaari Paata Movie Latest Movie Updates,Mahesh Babu Next Project with Director Trivikram srinivas Movie #SSMB 28, Jr NTR and Wife Pranathi,JR NTR Movies,Jr NTR Upcoming Moive RRR,JR NTR with Ram charan MOvie RRR,RRR Latest Updates,JR NTR Latest Movie Updates, Director Koratala Siva with JR NTR Upcoming Movie #NTR30,Allu Arjun and Sneha Reddy,Allu Arjun Movies,Allu Arjun Block Buster Movie Pushpa The Rise, Allu Arjun Upcoming Movies,Allu Arjun Latest SUper Hit Movies,Ram Charan and Upasana,Ram charan upcoming Movies,Ram Charan RRR Movies,Ram Charan Nw movies, Ram charan RC 15 Movie Updates,Ram charan New Porjects,Ram charan coming up project RC16,

మహేష్ బాబు – నమ్రత : సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు బాల నటుడిగా పలు మూవీస్ తో ప్రేక్షకులను అలరించి సూపర్ హిట్ “రాజకుమారుడు”మూవీ తో హీరోగా మారారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం “సర్కారు వారి పాట“మూవీ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా “#SSMB 28 “మూవీ ప్రారంభం అయ్యింది. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన “వంశీ”(2000) మూవీ లో మహేష్ బాబు కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ శిల్ప శిరోద్కర్ సోదరి మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్ నటించారు. నమ్రత తో ప్రేమలో పడిన మహేష్ బాబు 2005 సంవత్సరం లో వివాహం చేసుకున్నారు. వారికి తనయుడు గౌతమ్ , తనయ సితార ఉన్నారు తనకు టైమ్ దొరికినప్పుడు కుటుంబ సభ్యులతో మహేష్ ఎంజాయ్ చేస్తారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎన్టీఆర్ – ప్రణతి : లెజెండరీ యాక్టర్ నందమూరి తారకరామారావు మనవడు , ఫిల్మ్ యాక్టర్ , పొలిటీషియన్ హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ “బ్రహ్మర్షి విశ్వామిత్ర “(1991”) మూవీ తో బాల నటుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. గుణశేఖర్ దర్శకత్వం లో బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న చిల్డ్రెన్ ఫిల్మ్ “రామాయణం”లో జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్ లో నటించారు. “నిన్ను చూడాలని”మూవీ తో హీరోగా మారిన ఎన్టీఆర్ “స్టూడెంట్ నెం 1 “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి భారీ హిట్ అందుకున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన యాక్టింగ్ స్టైల్ తో ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన “ఆర్ ఆర్ ఆర్”మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30 “మూవీకి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
నార్నే ఎస్టేట్స్ అధినేత నార్నే శ్రీనివాస్ తనయ లక్ష్మి ప్రణతిని 2011 సంవత్సరంలో ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారు. వీరికి అభయ్ రామ్ , భార్గవ్ రామ్ తనయులు.

అల్లు అర్జున్ – స్నేహారెడ్డి : మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా “విజేత”మూవీ తో పరిచయం అయ్యి “డాడీ ” మూవీ లో డ్యాన్సర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. మ్యూజికల్ హిట్ “గంగోత్రి “మూవీ తో హీరోగా మారి అల్లుఅర్జున్ బ్లాక్ బస్టర్ “ఆర్య ” మూవీ తో హీరో గా ఎస్టాబ్లిష్ అయ్యారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అల్లు అర్జున్ తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ “పుష్ప :ది రైజ్”మూవీ తో అల్లుఅర్జున్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అభిమానులు ఐకాన్ స్టార్ గా పిలుచుకునే అల్లు అర్జున్ ప్రస్తుతం “పుష్ప”ది రూల్ మూవీ లో నటిస్తున్నారు. అల్లు అర్జున్ తన ఫ్రెండ్ మ్యారేజ్ లో బిజినస్ మ్యాన్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తనయ స్నేహా రెడ్డి ని కలిసి మొదటి చూపులోనే స్నేహా రెడ్డి తో ప్రేమలో పడ్డారు. స్నేహారెడ్డి , అల్లు అర్జున్ తరుచూ ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకొనే వారు. ఇద్దరూ తమ రిలేషన్ షిప్ ను సీక్రెట్ గా మెయింటైన్ చేశారు. తరువాత అల్లు అర్జున్ , స్నేహారెడ్డి 2011 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. వీరికి తనయుడు అయాన్ , తనయ అర్హ ఉన్నారు.

రామ్ చరణ్ – ఉపాసన: మెగా స్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ సూపర్ హిట్ “చిరుత”మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆమూవీ లో తన యాక్టింగ్ , డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన రెండవ మూవీ “మగధీర “లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షక, అభిమానులను అలరిస్తున్న రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “#RC15 ” మూవీ లో నటిస్తున్నారు. ,సూపర్ హిట్ “జెర్సీ “మూవీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో “#RC16 ” మూవీకి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ సి ప్రతాపరెడ్డి మనవరాలు , హెల్త్ కేర్ బిజినెస్ మ్యాన్ అనిల్ కామినేని , శోభన కామినేని తనయ , అపోలో వైస్ చైర్మన్ ఉపాసనను హీరో రామ్ చరణ్ ఒక స్పోర్ట్స్ క్లబ్ మీటింగ్ లో ఫస్ట్ టైమ్ కలుసుకున్నారు. స్నేహితులకు కూడా తెలియ కుండా 5 సంవత్సరాల పాటు ప్రేమించుకున్న రామ్ చరణ్ , ఉపాసన 2012 లో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ ప్రస్తుతం దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

పోల్ గేమ్ : రియల్ లైఫ్ బెస్ట్ జోడీ ?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =