హీరో ప్రభాస్ , రాజమౌళి ఇంటర్వ్యూ విశేషాలు

Actor Prabhas Rajamouli Interview Highlights

“రాధేశ్యామ్ “మూవీ రిలీజ్ సందర్భంగా హీరో ప్రభాస్ , స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇంటర్వ్యూ లో వారిద్దరి మధ్య సంభాషణ సరదాగా సాగింది.ప్రభాస్ మాట్లాడుతూ .. “బాహుబలి” తరువాత యాక్షన్ తో కూడిన లవ్ సినిమా చేయాలని అనుకున్నాననీ , కానీ రాధాకృష్ణ కుమార్ పూర్తి లవ్ స్టోరీ చేశాడనీ , “బాహుబలి” మూవీ తరువాత తనతో “రాధేశ్యామ్ ” వంటి లవ్ స్టోరీ చేయాలనుకోవడం అంత ఈజీ కాదనీ, అయినా చేసినందుకు ఆయనకి థ్యాంక్స్ అనీ అన్నారు. రాజమౌళి మాట్లాడుతూ “సంచారి” సాంగ్ తనకు బాగా నచ్చిందనీ , ఆ పాటలో ఒక చోట నీ నవ్వు నచ్చిందనీ అనగా అందుకు ప్రభాస్ నవ్వుతూ మీకు నచ్చిందంటే అందరికీ నచ్చుతుందనే నమ్మకం తనకు ఉందనీ చెప్పారు. ప్రభాస్ మాట్లాడుతూ .. “రాధేశ్యామ్” సినిమాకీ .. ‘ఆర్ ఆర్ ఆర్’ మధ్య ఏదో సంబంధం ఉందనీ ,  అందువల్లనే మీరు మీ సినిమా రిలీజ్ కి ఉండగా “రాధేశ్యామ్ “ప్రమోషన్స్ కి వచ్చి మాట్లాడుతున్నారనీ , ‘రాధేశ్యామ్’ షూటింగ్ అన్నపూర్ణలో జరుగుతుండగా. ఆ పక్కనే మీ ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ జరుగుతూ ఉండేదనీ , మీరు అక్కడ యాక్షన్ అని చెప్పడం .. ఇక్కడ తనకు రాధాకృష్ణ యాక్షన్ అని చెప్పడం గమ్మత్తుగా ఉండేదనీ అన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“వర్షం” వంటి ఒక అబ్బాయి అమ్మాయి వెనుక పడే కాన్సెప్ట్ లతో సినిమాలు చేయనున్న మీరు ఒక అమ్మాయి వెంట ఒక అబ్బాయి పడినట్టుగా “మగధీర” ఎలా తీశారని ప్రభాస్ అడగగా నువ్వే చెడగొట్టావ్ నన్నుఅని రాజమౌళి కూల్ గా చెప్పడంతో ప్రభాస్ ఒక్కసారిగా నవ్వేశారు. సార్ .. “ఆర్ ఆర్ ఆర్” సినిమాలో తనకు ఒక గెస్టు రోల్ ఇచ్చి ఉండాల్సింది కదా? ఎన్టీఆర్ – చరణ్ లతో కలిసి తాను కూడా స్క్రీన్ పై కనిపిస్తే ఎంత బాగుండేది. మీరు తలచుకుంటే తన కోసం ఆ సినిమాలో ఒక పాత్రను క్రియేట్ చేయలేరా?” అంటూ ప్రభాస్ అడగగా బాబూ ప్రభాసూ నువ్వు పెద్ద షిప్పులాంటివాడివనీ , తన సినిమాలో ఒక సీన్ కి పెద్ద షిప్ అవసరమై ఉంటే తప్పకుండా రిక్వెస్ట్ చేసైనా ఒప్పించేవాడిని. అలా కాకుండా ప్రభాస్ తన మాట కాదనడనీ , చెప్పగానే చేస్తాడనే ఉద్దేశంతో ఇంత పెద్ద షిప్పును తీసుకుని వెళ్లి ఆ సీన్లో ఇరికించలేననీ రాజమౌళి అన్నారు. తన కంటే మీకు చరణ్ .. ఎన్టీఆర్ ఎక్కువ అని సరదాగా ప్రభాస్ అంటే తనతో సినిమా చేసే హీరోలతో తాను ఉండే తీరు అలాగే అనిపిస్తుందనీ రాజమౌళి అనడం కూడా ఈ ఇంటర్వ్యూ కి హైలైట్ గా నిలిచింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =