యంగ్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా “కిరాతక “, “జంగిల్ “, “తీస్ మార్ ఖాన్”, “అమరన్””బ్లాక్ “, “అతిథి దేవోభవ ” మూవీస్ సెట్స్ పైన ఉన్నాయి. తాజాగా ఆది హీరోగా ఒక న్యూ మూవీ అనౌన్స్ అయ్యింది. సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం 10 గా ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తెరకెకెక్కుతుందని నిర్మాణ సంస్థ అనౌన్స్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆది సాయికుమార్ హీరోగా ” ప్రొడక్షన్ నెం 10 ” మూవీ తెరకెక్కుతుంది. రైటర్ ఫణి కృష్ణ సిరికి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ధృవన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ.అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అద్భుతమైన కథతో ఫణికృష్ణ తనను సంప్రదించారనీ , ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయనీ , ఆది సాయికుమార్ ఈ సబ్జెక్ట్ కి సరిగ్గా సరిపోతారనీ , ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి బాగా వస్తోందనీ చెప్పారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























