‘భీమ్లా నాయక్’ రివ్యూ.. పవన్ నట విశ్వరూపం..!

Bheemla Nayak Telugu Movie Review,Bheemla Nayak Movie Review,Bheemla Nayak Review,Bheemla Nayak Telugu Movie Review And Rating,Bheemla Nayak Movie Review And Rating,Bheemla Nayak Review And Rating,Bheemla Nayak Telugu Movie Rating,Bheemla Nayak Movie Rating,Bheemla Nayak Rating,Bheemla Nayak Telugu Movie Public Talk,Bheemla Nayak Movie Public Talk,Bheemla Nayak Public Talk,Bheemla Nayak Movie Public Talk And Public Response,Bheemla Nayak Public Talk And Public Response,Bheemla Nayak Movie Public Response,Bheemla Nayak Public Response,Bheemla Nayak Movie Story,Bheemla Nayak Story,Bheemla Nayak Updates,Bheemla Nayak Movie Updates,Bheemla Nayak Telugu Movie Updates,Bheemla Nayak Movie Latest Updates,Bheemla Nayak Movie Latest News,Pawan Kalyan,Rana Daggubati,Nithya Menen,Samyuktha Menon,Samuthirakani,Thaman S,Saagar K Chandra,Naga Vamsi,Trivikram Srinivas,Trivikram,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Pawan Kalyan Bheemla Nayak Telugu Movie Review,Pawan Kalyan Bheemla Nayak Movie Review,Pawan Kalyan Bheemla Nayak Review,Pawan Kalyan Bheemla Nayak,Pawan Kalyan Bheemla Nayak Movie,Rana Daggubati Movies,Rana Daggubati New Movie,Daniel Shekar,Bheemla Nayak Trailer,Bheemla Nayak Songs,Bheemla Nayak Movie Songs,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Reviews,Latest Telugu Movie Reviews,New Telugu Movies 2022,Telugu Reviews 2022,Telugu Cinema Reviews,Telugu Movies 2022,#BheemlaNayak,#BheemlaNayakReview

భీమ్లా నాయక్.. భీమ్లా నాయక్ గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తుంది. సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా కాంబినేషన్ వస్తున్న సినిమా ఈ భీమ్లానాయక్. పవన్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఈసినిమా కోసం ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. ఇక ఫైనల్ గా నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉందో.. ప్రేక్షకుల అంచనాలను ఎంత వరకూ రీచ్ అయిందో చూద్దాం…

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు..పవన్ కళ్యాణ్, రానా, నిత్యమీనన్, సంయుక్త మీనన్, మురళీ శర్మ, సముద్రఖని, రావు రమేష్ తదితరులు
డైరెక్టర్.. సాగర్ కె. చంద్ర
నిర్మాత.. సూర్యదేవర నాగవంశీ
బ్యానర్.. సితార ఎంటర్ టైన్ మెంట్స్
సంగీతం.. థమన్
సినిమాటోగ్రఫి..రవి.కె.చంద్రన్
ఎడిటర్.. నవీన్ నూలి

కథ..

ఆత్మాభిమానానికి.. అహంకారానికి మధ్య యుద్దం జరిగితే ఎలా ఉంటుందో అన్నది ఈసినిమా మెయిన్ థీమ్ అని మన అందరికీ తెలిసిందే. డానియల్ శేఖర్ (రానా) ఒక రోజు రాత్రి కార్ లో తన సొంతూరుకు వెళుతుండగా.. అనుకోకుండా పోలీసుల చెకింగ్ లో డానీ కార్ లో లిక్కర్ బాటిల్స్ దొరుకుతాయి. తాను రిటైర్డ్ హవల్దార్ నని, తనకు అవి కోటాలో వచ్చాయని చెప్పినా ఎవరూ పట్టించుకోరు. ఆ ఏరియాలో మద్యం నిషేధం ఉండడంతో.. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా..డానీ వారిమీద తిరగబడతాడు. ఇంతలో పోలీస్ సబ్ ఇన్సిపెక్టర్ భీమ్లా నాయక్ (పవన్) సీన్ లోకి వస్తాడు. సిన్సియర్ ఆఫీసర్ అయిన భీమ్లానాయక్ అతడ్ని కొట్టి జీప్ ఎక్కించి పోలీస్ స్టేషన్ కి తీసుకెళతాడు. దాంతో హర్ట్ అయిన డానీ.. భీమ్లా ను ఓ కేస్ లో ఇరికిస్తాడు. దాంతో భీమ్లా నాయక్ సస్పెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇక అక్కడి నుండి ఇద్దరి మధ్య వార్ మొదలవుతుంది. ఈ గొడవలో సుగుణ(నిత్యామీనన్) కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి….చివరికి ఈ పోరాటంలో ఎవరు గెలిచారు.. ఫైనల్ గా ఏమైంది అన్నదే మిగతా కథ.

ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా బులెట్ దిగిందా..! లేదా..! అన్నది ముఖ్యం పోకిరీ సినిమాలో మహేష్ చెప్పినట్టు సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందనేది కాదు.. ఆ సినిమా ఎలా ఉంది.. ప్రేక్షకులకు ఎంత నచ్చింది అన్నది ముఖ్యం.. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ఎన్నోరోజులనుండి వాయిదా పడుతూ వస్తున్న ఈసినిమానేడు ప్రేక్షకుల ముందుకు రాగా సూపర్ టాక్ ను సొంతం చేసుకుంది. పాత్రల ఇంట్రడక్షన్ కు ఎక్కువ స్పేస్ తీసుకొని బోరుకొట్టించకుండా సినిమా స్టార్టింగ్ నుండే మెయిన్ ప్లాట్ లోకి తీసుకెళ్లిపోయారు. సీన్ నెంబర్ వ‌న్ నుంచి క‌థ‌లోకి వెళ్లిపోయాడు ద‌ర్శ‌కుడు. డానిని అరెస్ట్ చేయ‌డం, పోలీస్ స్టేష‌న్‌లో డానీ త‌న పొగ‌రు చూపించ‌డం, డానీ ని రిమాండ్ కి పంపడం… ఇవ‌న్నీచ‌క చక సాగిపోతాయి. ఆ త‌ర‌వాత ఒక‌రిపై మ‌రొక‌రు గెల‌వ‌డానికి ఏం చేశార‌న్న‌ది సెకండ్ పార్ట్ లో కీలకంగా చూపించారు.

ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకూ చేసిన సినిమాలు ఒక లెక్క అయితే ‘భీమ్లా నాయక్’ మాత్రం మరోలెక్క అన్నట్టు ఉంది. బద్రి, తొలిప్రేమ, ఖుషి, అత్తరాంటికి దారేది, రీసెంట్ గా వచ్చిన వకీల్ సాబ్ ఇలాంటి సినిమాలు కమర్షియల్ సినిమాలే అయినా పవన్ లో ఉన్న క్లాసీ యాంగిల్ కూడా కనిపిస్తుంటుంది. కానీ ఈసినిమా మాత్రం ఫక్త్ కమర్షియల్ సినిమా. పవన్ కెరీర్ ఫుల్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా చేసిన సినిమా ఇదే అని చెప్పొచ్చు. ఇక పవన్ గురించి చెప్పేదేముంది.. సినిమాకు ప్రాణం పవన్ కళ్యాణే. పవన్ లేకపోతే భీమ్లానాయక్ లేదు. ఆ డైలాగ్స్, పవన్ ఆటిట్యూడ్.. యాక్షన్ సీక్వెన్స్ పవన్ విశ్వరూపం చూపించాడు. ఒక రకంగా చెప్పాలంటే పవన్ ఫ్యాన్స్ కుర్చీలో కూర్చోవడం కొంచం కష్టమే..

ఒక సినిమాలో నాయకుడి పాత్ర హైలెట్ అవ్వాలంటే దానికి తగ్గట్టు ప్రతి నాయకుడి పాత్ర ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది. అలానే భీమ్లా నాయక్ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో రానా దగ్గుబాటి చేశాడు కాబట్టే ఆ పాత్రకు అంత బలం వచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే బాహుబలి సినిమాల్లో రానా విలనిజం కూడా ఏ రేంజ్ లో చేయగలడో చూపించాడు.. ఇప్పుడు ఈసినిమా ద్వారా మరోసారి నిరూపించాడు. పవన్ కు తగ్గ విలన్ అనిపించుకున్నాడు. డానియేల్ పాత్రలో రానా నటించాడు కాబట్టే భీమ్లా నాయక్ పాత్ర అంత ఎలివేట్ అయిందని చెప్పడంతో ఎలాంటి సందేహం లేదు. పొగరుబోతుగా పవన్ తో ఢీ కొట్టే పాత్రలో రానా ఇరగ్గొట్టేశాడు. ఇక మిగతా ఆర్టిస్ట్ లలో పవన్ భార్య సుగుణగా నిత్యామీనన్, రానా తండ్రిగా సముద్ర ఖని, రానా భార్యగా సంయుక్తా మీనన్,రానా డ్రైవర్ గా రఘుబాబు, ఎమ్మెల్యే నాగరాజుగా రావు రమేష్,లాయర్ గా హర్షవర్దన్, ఎమ్మల్యేగా తణికెళ్ళ తన పాత్రలకు ప్రాణం పోసారు.

తెర వెనుక అద్భుతాలు..

నిజానికి ఈసినిమా మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. అయితే త్రివిక్రమ్ చేసిన మ్యాజిక్ వల్ల ఆ ఫ్లేవర్ మాత్రం ఎక్కడా కనిపించదు. మరోసారి గురూజీ తన కలానికి ఉన్న పదును చూపించాడు. పవన్ అభిమానులకు.. తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయో తెలుసు కాబట్టి వాటిని చక్కగా జోడించి మాటలను అందించారు. దీనివల్ల ఒరిజినల్ సినిమాను చూస్తున్న ఫీలింగే ఉంటుంది కానీ రీమేక్ అన్న ఆలోచన కూడా రాదు. ఇక దానికి తగ్గట్టే సాగర్ కూడా తన దర్శకత్వం ప్రతిభను చూపించాడు. పవన్ లాంటి హీరోను ఇంత త్వరగా డైరెక్ట్ చేసే అవకాశం రావడం ఒకరకంగా అదృష్టమనే చెప్పాలి. ఆ అవకాశాన్ని సాగర్ కూడా చాలా బాగా వినియోగించుకున్నాడు. సినిమాను చాలా బాగా డైరెక్ట్ చేశాడు. అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు చిత్రాలతో తనేంటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు సాగర్ చంద్ర. మరోసారి ఈ సినిమాతో ఇద్దరి హీరోలను ఎలా హ్యాండిల్ చేయొచ్చో….మాస్ సీన్స్ ని ఎలా, ఎంత ఎఫెక్టివ్ గా ప్రెజెంట్ చేయొచ్చో చూపించారు.

ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్. ఇప్పటికే పవన్ వకీల్ సాబ్ కు తన మ్యూజిక్ అందించిన థమన్ ఈసినిమాకు కూడా చేసే ఛాన్స్ కొట్టేశాడు. మరి పవన్ సినిమా కాబట్టి ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి.. థమన్ కూడా చాలా కష్టపడి అదే రేంజ్ లో ఈసినిమాకు పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఇప్పటికే పాటలు ఫుల్ ఫేమస్ అయిపోయాయి.. ఇక చెప్పకోవాల్సింది బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమా స్థాయి మారిపోయింది. యాక్షన్ సీక్వెన్స్ కానీ.. కీలక సన్నివేశాల్లో కానీ థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూజ్ బంప్స్ తెప్పిస్థాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ కాబట్టి నిర్మాణ విలువలు ఎలాగూ రిచ్ గా ఉంటాయి. రవి కె చంద్రన్ కెమెరా వర్క్ కూడా బాగుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే అడవి సీన్స్ హైలెట్ గా ఉంటాయి. ఇక ఎడిటింగ్ కూడా బావుంది. ఒరిజినల్ లో ఉన్న లెంగ్త్ ని తగ్గించటం ఈసినిమాకు కలిసి వచ్చింది.

ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా పవన్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు ప్రతి వర్గం తప్పకుండా చూడాల్సిన సినిమా అని చెప్పొచ్చు. పవన్-రానా ల పెర్ఫామెన్స్, త్రివిక్రమ్ రైటింగ్, సాగర్ డైరెక్షన్, థమన్ మ్యూజిక్ ప్రతి ఒక్కటి ఫర్ఫెక్ట్ గా సెట్ అయి వచ్చిన ఈసినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకునే సినిమా ఇది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here