సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “భీమ్లా నాయక్ ” మూవీ ఫిబ్రవరి 25 వ తేదీ భారీ ఎత్తున రిలీజ్ కానుంది. “భీమ్లా నాయక్ ” మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.థమన్ ఎస్ సంగీతం అందించారు. “భీమ్లా నాయక్”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , గ్లింప్స్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు తో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానున్న “భీమ్లా నాయక్”మూవీ ని చిత్ర యూనిట్ ప్రపంచవ్యాప్తంగా 4000 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. బ్లాక్ బస్టర్ “వకీల్ సాబ్” మూవీ తరువాత పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన “భీమ్లా నాయక్”మూవీకై అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు. తాజాగా “భీమ్లా నాయక్”మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ మూవీ కి U/A సర్టిఫికేట్ జారీ చేసింది. “భీమ్లా నాయక్”మూవీపై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































