చిరు-జగన్ భేటీ పై నాగార్జున స్పందన..!

Nagarjuna Reacts About YS Jagan And Chiranjeevis Meeting,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates, Nagarjuna,Nagarjuna Reacts On Ys Jagan and Chiranjeevi Meeting,Chiranjeevi Meet Ys Jagan Mohan Reddy,Chiranjeevi Meet Jagan Mohan Reddy on Movie Ticket Issue, Cinema Industry,Tollywood Industry,Movie Industry,Movie Tickets,Ap Cinema Ticket Price,Ap Movie Ticket Price,Movie Ticket Price In AP, Andhra Pradesh Movie Ticket Price,Issue On Movie Ticket,Ap Government,Andhra Pradesh Government,AP CM Jagan Mohan Reddy,Megastar Chiranjeevi, Megastar Chiranjeevi and YS Jagan Mohan Reddy,Nargarjuna Bangarraju,Nargarjuna Bangarraju Movie,Nargarjuna Bangarraju Release On 14th Jan, Nargarjuna Bangarraju Telugu Movie,Nargarjuna Bangarraju Release On Sankranthi,Ram Gopal Varma and perni nani, Ram Gopal Verma Meet With Peri Nani

ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల రేటు విషయంలో తీసుకున్న నిర్ణయాలపై గత కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వానికి-సినీ పరిశ్రమకు మధ్య కాస్త దూరం కూడా పెరిగిందని చెప్పొచ్చు. ఇక పవన్ కళ్యాణ్ కు ఏపీ ప్రభుత్వానికి మధ్య పెద్ద వారే నడుస్తుంది. కొంతమంది సైలెంట్ గా ఉన్నా ఈ విషయంపై ఇప్పటికే చాలా మంది హీరోలు బహిరంగంగానే తమ అభిప్రాయాలను తెలియచేశారు. నాని అయితే చాలా సార్లు ఈ విషయంపై మాట్లడగా.. నానిపై పలు కామెంట్స్ కూడా వేశారు. అంతేకాదు ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపు విషయమై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా భేటీ అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా నేడు ఈవిషయంపై చర్చించడానికి మెగాస్టార్ చిరు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఈ భేటీలో ప్రధానంగా సినిమా టికెట్ల ధరల అంశం, సినీ ఇండస్ట్రీ సమస్యల గురించి చర్చించినట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలో వీరి భేటీపై కింగ్ నాగార్జున స్పందిస్తూ.. “మా అందరి కోసం చిరంజీవి జగన్ తో సమావేశమయ్యారు.. నేను సినిమా విడుదల ఉండటం వల్ల చిరంజీవితో కలిసి వెళ్లలేకపోయా” అంటూ తెలిపారు. మరి సినీ పెద్దలందరూ కలిసి మరోసారి జగన్ ను కలిసి తమ సమస్యల గురించి చెబుతారేమో చూడాలి.

కాగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా బంగార్రాజు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ఇది సీక్వెల్. ఈసినిమాలో నాగచైతన్య కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈసినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.