టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ఇప్పటికే ఇండస్ట్రీ ఎంతో మంది పెద్దలను కోల్పోయింది. ఈ రెండేళ్లలోనే ఎంతోమందిని కోల్పోయారు. అందులో యంగ్ నటీనటుల దగ్గర నుండి సీనియర్స్, లెజెండ్స్ ఎంతోమంది ఉన్నారు. కొంతమంది కరోనా వల్ల మరణిస్తే కొంతమంది వయోభారం వల్ల వచ్చే అనారోగ్య పరిస్థితుల వల్ల..మరి కొంతమంది హఠాన్మరణం చెందారు. ఇక ఇప్పుడు మరో సీనియర్ డైరెక్టర్ కన్నుమూశారు. ఆయనెవరో కాదు ప్రముఖ సినీ దర్శకుడు ప.చంద్ర శేఖర్ రెడ్డి (86). ఆయన ఈ రోజు ఉదయం చెన్నై లో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఇక ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు పి.సి.రెడ్డికి సంతాపం తెలియజేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా 1933 అక్టోబర్ 15న శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనుమసముద్రం గ్రామంలో జన్మించారు చంద్ర శేఖర్ రెడ్డి. 1959లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన తన సినీ కెరీర్లో సుమారు 80 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి టాలీవుడ్ లెజెండరీ నటులతో ఆయన పని చేశారు. అందులో సూపర్ స్టార్ కృష్ణ చిత్రాలకు ఎక్కువగా దర్శకత్వం వహించారు. 2014లో వచ్చిన జగన్నాయకుడు సినిమా ఆయన ఆఖరి సినిమా.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: