‘ఆర్ఆర్ఆర్’.. ఎన్టీఆర్-చరణ్ ఫ్రెండ్ షిప్ పై రాజమౌళి కామెడీ

SS Rajamouli Funny Comments On Jr NTR And Ram Charan Friendship, RRR Telugu Press Meet, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, NTR Funny Moment With Rajamouli, NTR Funny Moment With Rajamouli At RRR Telugu Press Meet, NTR Making Fun On Rajamouli At RRR Press Meet, NTR Making Super Fun On SS Rajamouli, NTR Making Super Fun On SS Rajamouli At RRR Telugu Press Meet, Rajamouli Fun With NTR And Ram Charan, Rajamouli Making Hilarious Fun With NTR And Ram Charan, Ram charan, Ram Charan RRR, Ram Charan RRR Movie, RRR Film, RRR Hyderabad Event, RRR Latest Update, RRR Media Interaction At Hyderabad, RRR Movie, RRR Movie Latest Update

ఇప్పుడున్న టాలీవుడ్ హీరోల మధ్య మెచ్చుకోదగిన విషయం ఏంటంటే అంతా చాలా ఫ్రెండ్లీగా ఉండటం. గత జనరేషన్ హీరోల మధ్య ఉండేది కానీ బయటపెట్టిన సందర్బాలు చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు హీరోల మధ్య ప్రెండ్ షిప్ మాత్రం బహిరంగంగానే చూపిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న హీరోల్లో రామ్ చరణ్- ఎన్టీఆర్ మధ్య ఉన్న ప్రెండ్ షిప్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే ఇక వారి అభిమానులకు ఎలా ఉంటుందో కూడాచెప్పనక్కర్లేదు. ఇప్పుడు పరిస్థితి అలానే ఉంది. రాజమౌళి దర్శకత్వంలో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమా మాత్రం స్నేహం నేపథ్యంలోనే ఉంటుందని అంటున్నారు రాజమౌళి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నారు. ఇక పలు భాషల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి అన్ని చోట్లా దాదాపు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈసందర్భంగా చిత్రయూనిట్ కూడా ప్రెస్ మీట్లలో పాల్గొంటూ పలు ఆసక్తికర విషయాలు తెలియచేస్తున్నారు. ఈనేపథ్యంలో ముఖ్యంగా రాజమౌళి ఎన్టీఆర్-చరణ్ మధ్య ఉన్న ప్రెండ్ షిప్ గురించి చెప్పారు. అంతేకాదు సెట్ లో వారు ఎంత కామెడీగా ఉంటారో కూడా చెపుతూ ఫన్ చేశారు. సెట్ లో ఇద్దరూ గొడవపడతారని.. తారక్- చరణ్ పై కంప్లైంట్ ఇస్తుంటాడు.. చరణ్ మాత్రం అమాయకంగా ఫేస్ పెట్టి నేనేం చేయలేదు అంటాడు.. షూటింగ్ లో కనీసం ఒక 20-25 డేస్ వీళ్ల ఫైటింగ్ కే పోయి ఉంటాయని అని కామెడీ చేశాడు. మరి ప్రెస్ మీట్లలో కూడా చూస్తూనే ఉన్నాం.. చరణ్-ఎన్టీఆర్ ఎలా ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటున్నారో.

 

View this post on Instagram

 

A post shared by Telugu FilmNagar (@telugufilmnagar)

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here