“మడ్డీ “మూవీ ఇండియన్ ఫస్ట్ మడ్ రేసింగ్ మూవీ గా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కింది. పి కె 7 క్రియేషన్స్ బ్యానర్ పై ప్రభగల్ దర్శకత్వంలో యువన్ , రిథాన్ కృష్ణ , అనూష సురేష్ , అమిత్ శివదాస్ నాయర్ ప్రధానపాత్రలలో మడ్ రేసింగ్ నేపథ్యం లో తెరకెక్కిన “మడ్డీ ” మూవీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో డిసెంబర్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు భాషలో “మడ్డీ “మూవీని శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ సంస్థ ద్వారా మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీగా రిలీజ్ చేస్తున్నారు. దర్శకుడు ప్రభగల్‌కి రోడ్ రేసింగ్ లో అనుభవం ఉంది. దానిపై ఆయన ఐదేళ్ల రిసెర్చ్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘మడ్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కించిన తొలి భారతీయ చిత్రమిదనీ , రెండు వేర్వేరు జట్ల మధ్య పోరు, ఆ ఆటగాళ్ల మధ్య వైరం ఆకట్టుకుంటాయనీ , మడ్ రేసింగ్‌లో ఆటగాళ్లు రెండేళ్ల పాటు శిక్షణ పొందారనీ, ఎలాంటి డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో నటించారనీ , మంగళవారం ట్రైలర్ విడుదల చేస్తున్నామనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: