సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో రూపొందుతున్న సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ “భీమ్లా నాయక్ ” మూవీ జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్యామీనన్ , రానా కు జోడీ గా మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవన్ కళ్యాణ్ పక్కా ప్రొఫెషనల్ అనీ , ఆయనతో వర్క్ చేయడం ఈజీ అని స్టైలిస్ట్ రజిని చెప్పారు. పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్ అయినా తనకు కాస్ట్యూమ్స్ ట్రయల్ లో ఫ్రీడం ఇచ్చారనీ , ఎంతో సహనం తో తనకు సహకరించారనీ , “వకీల్ సాబ్ ” మూవీ కి తాను కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసినా పవన్ సార్ కు వర్క్ చేయలేదనీ, 2 గంటల్లో 15 అవుట్ ఫిట్స్ పవన్ కళ్యాణ్ ట్రై చేశారనీ స్టైలిస్ట్ రజిని అయన పై ప్రశంసలు కురిపించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: