అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై డాన్ శ్యాండీ దర్శకత్వంలో పి. రమేష్ పిళ్ళై నిర్మాతగా ప్రభుదేవా, రెజీనా, అనసూయ, ఆర్యన్ ప్రధాన పాత్రలలో”ఫ్లాష్ బ్యాక్” తమిళ మూవీ తెరకెక్కింది. శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ఎ.ఎన్ బాలాజీ గుర్తుకొస్తున్నాయి అనే ట్యాగ్‌లైన్ తో “ఫ్లాష్ బ్యాక్” మూవీ ని తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ శరవేగంగా జరుగుతున్నట్లుగా చిత్రయూనిట్ తెలిపింది. అందులో భాగంగా యాంకర్, నటి అనసూయ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్న ఫొటోలను చిత్రయూనిట్ విడుదల చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘బలమైన ఎమోషన్స్‌తో కూడిన కథను నేటితరం ప్రేక్షకులు కోరుకునే ఆసక్తికర సన్నివేశాలు జోడిస్తూ ఈ సినిమాని తెరకెక్కించడం జరిగిందనీ , అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా ఈ మూవీని రూపొందించామనీ ,”ఫ్లాష్ బ్యాక్” మూవీ లో రెజీనా ఓ ఆంగ్లో ఇండియన్ టీచర్ గా, అనసూయ ఒక కీలక పాత్రలో నటించారనీ , ఈ ఇద్దరి రోల్స్ సినిమాలో మేజర్ అట్రాక్షన్ కానున్నాయనీ , అలాగే ప్రభుదేవా క్యారెక్టర్ కూడా కొత్తగా ఉంటుందనీ , అతిత్వరలో చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తామనీ తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: