ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా రూపొందిన సినిమా ‘కె.జి.యఫ్ ఛాప్టర్ 2’. ఈసినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అందుకు తగ్గట్టే రిలీజ్ కూడా లేట్ అవుతుంది. ఫైనల్ గా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ప్రపంచం వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు ఈసినిమాలో నటిస్తున్న శ్రీ నిధి శెట్టి పుట్టినరోజు కావడంతో ఆమెకు అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా బర్త్ డే విషెస్ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కె.జి.యఫ్ టీమ్ కూడా నిధికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందించింది. శ్రీనిధి పోస్టర్ ను రిలీజ్ చేస్తూ.. ‘కేజీఎఫ్ 2’ లో రీనా దేశాయ్ గా నటిస్తోన్న మా కిల్లర్ లేడీ శ్రీనిధి శెట్టికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇందులో ఆమె ప్రేమిస్తుందా, వంచిస్తుందా.. ఇంకేం చేస్తుందా? అని తెలుసుకోడానికి చాలా ఆత్రుతగా ఉన్నారు ప్రేక్షకులు అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
Wishing our kill lady of #KGF a very happy birthday @SrinidhiShetty7 😍 aka Reena Desai. Curious to know what all Reena gonna bring in #KGFChapter2. Love, Brutality and whatnot? 🤩#KGF2onApr14 #hombalefilms#HBDSrinidhiShetty pic.twitter.com/xO4fIUWZHS
— KGF CHAPTER 2 (@thekgfchapter2) October 20, 2021
కాగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఈ చిత్రంలో అధీర అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. రవీనాటాండన్‌లతో పాటు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోంబలే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం .. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరి సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: