తమిళ్ లోనే కాదు తన సినిమాలతో తెలుగులో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరో శివ కార్తికేయన్. ఇక ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో శివకార్తికేయన్ ‘డాక్టర్’ అనే సినిమా తో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఎన్నో అంచనాల మధ్య నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉందో తెలియాలంటే మాత్రం రివ్యూ లోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. శివ కార్తికేయన్, ప్రియాంక మోహన్, యోగిబాబు, వినయ్ తదితరులు
దర్శకత్వం.. నెల్సన్ దిలీప్ కుమార్
బ్యానర్.. కేజేఆర్ స్టూడియోస్
సంగీతం.. అనిరుధ్
సినిమాటోగ్రఫి..విజయ్ కార్తీక్ కణ్ణన్
కథ..
వరుణ్ (శివకార్తికేయన్) మిలటరీలో డాక్టర్. మరోవైపు పద్మిని (ప్రియాంక అరుల్ మోహన్) తో ప్రేమలో పడినా ఇద్దరూ కొన్ని కారణాల వల్ల విడిపోతారు. ఆసమయంలో. తన ప్రేమ నుండి బయట పడుతున్న సమయంలో పద్మిని చెల్లెలు కిడ్నాప్ అయినట్లు తెలుస్తుంది. ఈ సమయంలో వరుణ్ పద్మిని ఫ్యామిలీకి సహాయం చేస్తాడు. మరి డాక్టర్ వరుణ్ కిడ్నాపర్‌ని ఎలా ట్రాక్ చేస్తాడు.. ? వరుణ్ కు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయ..? అన్నది ఈ సినిమా కథ
విశ్లేషణ..
చిన్న పాత్రల ద్వారా కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శివ కార్తికేయన్ ఇప్పుడు స్టార్ హీరోగా కెరీర్ లో దూసుకెళుతున్నాడు. దానికి కారణం తన నటన, తన పాత్రలు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సహజంగా ఉండే తన నటనే తనను స్టార్ హీరోను చేసింది. ఇక ‘రెమో’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో శివ కార్తికేయన్. ఆ తరువాత తన ప్రతి సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నాడు. ఇప్పుడు డాక్టర్ సినిమాను కూడా రిలీజ్ చేశాడు. ఇక ఈసినిమాలో కూడా ఎప్పటిలాగే తన పాత్రలో ఒదిగిపోయాడు శివ కార్తికేయన్. అయితే ఇప్పటివరకూ యాక్టివ్ పాత్రల్లో చేసిన శివ కార్తికేయకు ఇది నిజంగా కొత్త పాత్రే అని చెప్పొచ్చు. తక్కువగా మాట్లాడే పాత్ర శివకార్తికేయది.
ఇక ప్రియాంక కూడా తన నటనతో ఆకట్టుకుంది. యోగి బాబు మరోసారి తన కామిక్ టైమింగ్‌తో నవ్విస్తాడు. డిటెక్టివ్ ఫేమ్ వినయ్ రాయ్ నటన బాగుంది. మిలింద్ సోమన్ మరియు రఘు రామ్ తమ పాత్రమేర నటించారు.
ఇక నెల్సన్ దిలీప్‌కుమార్ మాస్ ఎంటర్టైనర్‌గా అద్భుతంగా చిత్రీకరించారు. నిజానికి తను తీసుకుంది చిన్న పాయింటే అయినా గట్టి స్క్రీన్ ప్లేతో సినిమాను ఇంట్రెస్టింగ్ గా మార్చాడు. ఇన్వెస్టిగేటింగ్ థ్రిల్లర్ అయినా కూడా దానికి కామెడీని కూడా పర్పెక్ట్ గా జోడించి నవ్వించగలిగాడు. ఇకఫస్ట్ హాఫ్ లో కామెడీ ఎక్కువ కీ రోల్ ప్లే చేసినా సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషన్ యాంగిల్ పై కాన్సన్ ట్రేట్ చేశాడు. ఇక అనిరుధ్ మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగా అందించాడు. విజయ్ కార్తీక్ కణ్ణన్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: