జీ స్టూడియోస్ సమర్పణలో బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ పై హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై” మూవీ 2022 సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి కథానాయిక. అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో హీరో కార్తికేయ ఒక నెగటివ్ రోల్ లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “వాలిమై” మూవీ ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , ఫస్ట్ సింగిల్ , కార్తికేయ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బైక్ రేసింగ్ మరియు పవర్ ఫుల్ డైలాగ్స్ , యాక్షన్ ఎపిసోడ్స్ తోరూపొందిన “వాలిమై” ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రష్యా లో “వాలిమై” మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసిన హీరో అజిత్ బైక్ ట్రిప్ తో రష్యా దేశం లో ముఖ్య ప్రదేశాలను కవర్ చేసారు. ప్రస్తుతం అజిత్ బైక్ ట్రిప్ తో ఇండియాలో సుందర ప్రదేశాలను కవర్ చేస్తున్నారు. ఈ బైక్ ట్రిప్ లో భాగంగా నిన్న ఆగ్రా చేరుకొని తాజ్ మహల్ దగ్గర ఫొటోకు ఫోజ్ ఇచ్చారు. ఆ ఫోటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: