‘పుష్ప’ రష్మిక ఫస్ట్ లుక్ రిలీజ్

Rashmika Mandanna First Look From Pushpa Movie Is Out Now,First Look Of Rashmika Mandanna From Pushpa The Rise Movie Unveiled,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Rashmika Mandanna First Look From Pushpa Movie,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Movie Latest News,Allu Arjun Pushpa Telugu Movie Live Updates,Heroine Rashmika Mandanna First Look From Pushpa,Actress Rashmika Mandanna First Look From Pushpa Telugu Movie,Rashmika Mandanna First Look From Allu Arjun Puspa,Rashmika Mandanna,Allu Arjun,Rashmika Mandanna Latest News,Rashmika Mandanna New Movie News

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప‌’. బన్నీ కెరీర్ లో మొదటి సారి పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ఇప్పటికే తెలుసు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈసినిమాలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న సంగతి తెలిసిందే. ముందు నుండే ఈసినిమాలో పాత్రలపై మంచి అంచనాలు ఉండగా దానికి తగ్గట్టే బన్నీ లుక్ ఉండటంతో ఫస్ట్ లుక్ తోనే సినిమాపై క్రేజ్ పెరిగిపోయింది. ఇక ఇప్పుడు తాాజాాాగా రష్మిక లుక్ ను కూడా రిలీజ్ చేయగా ఆమె లుక్ కూడా చాలా ఇంటెన్స్ గా ఉండటంతో అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇక సినిమాలో ర‌ష్మిక శ్రీవ‌ల్లి అనే పాత్రలో నటిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో మొదటి భాగాన్ని క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నట్టు ఇంతముందే చెప్పారు. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం అయితే డిసెంబర్ రిలీజ్ అవ్వడం కష్టమే అంటున్న వార్తలు మొదలయ్యాయి. ఇంకా చాలా రోజుల షూటింగ్ పెండింగ్ ఉందని.. నవంబర్ వరకూ షూటింగ్ జరిపినా డిసెంబర్ లోపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు అవ్వడం కష్టమే అంటున్నారు. మరి చూద్దాం సుకుమార్ చెప్పిన టైమ్ లోపు రిలీజ్ చేస్తాడా లేక ఈసినిమా రిలీజ్ కూడా వాయిదా పడుతుందా..

శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో పుష్ప సినిమా తెరకెక్కుతుంది. ఇందులో అల్లు అర్జున్ పుష్ప‌రాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తుండగా సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =