సూపర్ హిట్ “నేను శైలజ “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన కీర్తి సురేష్ బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ లో అద్భుతంగా నటించి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. తెలుగు , తమిళ, మలయాళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కీర్తి సురేష్ ప్రస్తుతం “సర్కారు వారి పాట “, “భోళా శంకర్ ” “సాని కాయిధమ్ “(తమిళ ), “వాశి ” మలయాళ మూవీస్ లో నటిస్తున్నారు. కీర్తి కథానాయికగా రూపొందిన ఉమెన్ సెంట్రిక్ మూవీ “గుడ్ లక్ సఖి “ “అన్నాత్తే”(తమిళ ) “మరక్కార్ ” (మలయాళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కీర్తి సురేష్ సోషల్ మీడియాలో రేర్ గా అభిమానులకు టచ్ లో ఉంటూ ఎక్కువగా ట్రెడిషనల్ ఫోటోలనే షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా కేరళ రాష్ట్ర పండుగ ఓనం ని పురస్కరించుకుని పండుగ సంప్రదాయం ప్రకారం చీర కట్టులో కీర్తి ఆకర్షణీయంగా రెడీ అయ్యారు. చెక్స్ గ్రీన్ బ్లౌస్ జాకెట్ క్రీమ్ కలర్ శారీతో , తలలో మల్లెపూలు, మెడ లో బంగారు నగలతో ఉన్న ఫొటోను కీర్తి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: