డ్యాన్సర్ , కొరియోగ్రాఫర్ , యాక్టర్ , ప్రొడ్యూసర్ , డైరెక్టర్ రాఘవ లారెన్స్ కోలీవుడ్ , టాలీవుడ్ లలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. హారర్ కామెడీ జోనర్ చిత్రాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న లారెన్స్ ఓవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు డైరెక్టర్ గా సినిమాలు చేస్తున్నారు. లారెన్స్ ప్రస్తుతం “రుద్రన్ “, “ఆధికారమ్ “తమిళ మూవీస్ లో హీరోగానటిస్తున్నారు . తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన అనౌన్స్ మెంట్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#Durga !!!
Need all your blessings 🙏🏻 pic.twitter.com/pVYNepkgFM
— Raghava Lawrence (@offl_Lawrence) August 6, 2021
స్వంత బ్యానర్ రాఘవేంద్ర ప్రొడక్షన్స్ లో ”దుర్గ” అనే టైటిల్ తో ఒక మూవీ ని రాఘవ లారెన్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా ‘దుర్గ’ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి ఈ చిత్రంలో తన భయానక గెటప్ ని రివీల్ చేశారు. ఈ పోస్టర్ లో లారెన్స్ తెల్లటి పొడవాటి గడ్డం.. గుబురు మీసాలు. నుదుటన పెద్ద బొట్టుతో సరికొత్త అవతారంలో కనిపిస్తున్నారు. ఇన్నాళ్లూ హారర్ సినిమాలతో భయపెడుతూ వచ్చిన లారెన్స్ ఇప్పుడు ఏకంగా గెటప్ తోనే భయం పుట్టిస్తున్నారు ఫస్ట్ లుక్ తోనే లారెన్స్ ”దుర్గ” మూవీ పై ఆసక్తిని కలిగించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: