స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా రూపొందిన పలు తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి. హీరో సూర్య తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన సూపర్ హిట్ “ఆకాశం నీ హద్దురా !”మూవీ లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటున్న సూర్య ప్రస్తుతం సన్ పిక్చర్స్ బ్యానర్ పై పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “#SURYA40” మూవీ లో నటిస్తున్నారు. వెట్రిమారన్ దర్శకత్వంలో ఒక మూవీ కి హీరో సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వి క్రియేషన్స్ బ్యానర్ పై వెట్రిమారన్ దర్శకత్వంలో సూర్య హీరోగా జల్లికట్టు నేపథ్యంలో “వాడి వాసల్ ” మూవీ తెరకెక్కనుంది. త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీ లో పాత్రకి హీరో సూర్య బుల్ ఫైట్ లో ట్రైనింగ్ పొందారు. సూర్య తన పాత్రకై శారీరకంగా , మానసికంగా ప్రిపేర్ అవుతున్నారు. సూర్య మరోవైపు టాలీవుడ్ లో స్ట్రెయిట్ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ , సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్ టైన్ మెంట్స్ టాలీవుడ్ లోనూ సినిమాలు నిర్మించే ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: