వైరల్ గా చిరు-పవన్ క్లాసిక్ పిక్

Mega Star Chiranjeevi and Power Star Pawan Kalyan Throwback Picture Goes Viral On Social Media,Devi Sri Prasad Shares A Charming Throwback Picture Of Chiranjeevi And Pawan Kalyan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Devi Sri Prasad,Devi Sri Prasad Latest News,Devi Sri Prasad New Movie News,Devi Sri Prasad New Photo With Chiranjeevi And Pawan Kalyan

మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ అవ్వడానికి అన్నదమ్ములు అయినా వీరిద్దరినీ కలిసి ఒకేసారి చాలా తక్కువ సార్లు చూసుంటాం.. ఎవరి సినిమాలతో వారు బిజీ.. ఎప్పుడైనా ఒకసారి సినీ వేదికలపైన కలిసి సందడి చేస్తుంటారు. ఏవైనా ఈవెంట్లలో చాలా చాలా రేర్ గా మాత్రమే ఆ ఇద్దరూ కలుస్తుంటారు. ఇక అప్పుడు మాత్రమే వారిద్దరిని కలిసి చూసే అవకాశం ఫ్యాన్స్ కు దక్కుతుంది. ఇక ఆ ఫోటోలను మెగాభిమానులు వైరల్ గా షేర్ చేస్తుంటారు. ఇప్పుడు అలాంటి ఒక రేర్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటో షేర్ చేసింది ఎవరో కాదు టాలీవుడ్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా దేవి శ్రీ ప్రసాద్ తన ట్విట్టర్ లో చిరు-పవన్ కు సంబంధించిన ఒక ఫొటో పోస్ట్ చేశాడు. అయితే ఇది ఇప్పటి పిక్ కాదు. 1997 ఫిలింఫేర్ మ్యాగజైన్ కవర్ పేజీ మ్యాగజైన్ కోసం ఇద్దరూ కలిసి దిగిన ఫొటో అది. కాచింగ్ ది కరెంట్స్ ఆఫ్ తెలుగు సినిమా తో ఆ మ్యాగజైన్ వచ్చింది. ఆ ఏడాది అలా ఇద్దరూ ఫిలింఫేర్ కవర్ పేజీపై దర్శనమిచ్చారు. ఈ కవర్ పేజీపై చిరు – పవన్ ఇద్దరూ హూడీలలో కనిపించారు. అన్నయ్యను పవన్ వెనుకనుండి కౌగిలించుకుని ఫోటోషూట్ కి ఫోజిచ్చారిలా. ఈఫొటో దేవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వ్వావ్ వాటే ఫోటో.. వ్వాటే మూవ్ మెంట్ !!! చిరు సర్.. పవన్ సర్ .. అంటూ ట్వీట్ చేశారు దేవీ. ఇది నిజంగా వెరీ రేర్ ఫోటో. అందుకే మెగాభిమానుల్లో వైరల్ గా మారింది.

 

ప్రస్తుతం చిరు పవన్ వరుస సినిమాతో బిజీగా ఉన్నారు. చిరు ఆచార్య సినిమా చేస్తున్నాడు ప్రస్తుతం. దీని తరువాత లూసిఫర్ రీమేక్.. తరువాత మెహర్ రమేష్ తో బాబితో సినిమాలు చేయనున్నాడు. ఇక పవన్ అయ్యప్పనుమ్ కోషియనుమ్ సినిమాతో పాటు హరిహర వీరమల్లు సినిమాలు చేస్తున్నాడు. వీటితో పాటు హరిష్ శంకర్ తో అలాగే సురేందర్ రెడ్డితో మరో సినిమా చేస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.