‘కె.జి.యఫ్ 2’ క్రేజీ అప్ డేట్.. రిలీజ్ లో మార్పు లేనట్టేనా..!

KGF 2 Movie Team Releases Another Interesting Update,BalaKrishna Neelakantapuram,Actor BalaKrishna Neelakantapuram,Inayath Khalil,Telugu Filmnagar,Rao Ramesh,Actor Yash,Yash,Rocking Star Yash,KGF Chapter 2,KGF Chapter 2 Movie,KGF Chapter 2 Telugu Movie,KGF Chapter 2 Update,KGF Chapter 2 Movie Updates,KGF Chapter 2 Movie Latest Updates,KGF Chapter 2 Movie News,KGF 2,KGF 2 Movie,KGF 2 Inayath Khalil,BalaKrishna Neelakantapuram As Inayath Khalil In KGF Chapter 2,BalaKrishna In KGF Chapter 2,KGF Chapter 2 Balakrishna Inayat Khalil Poster Out,KGF Chapter 2 Balakrishna Inayat Khalil Poster,KGF Chapter 2 Balakrishna Inayat Khalil First Look,Balakrishna As Inayat Khalil In KGF 2,BalaKrishna As Inayath Khalil,KGF: Chapter 2,KGF: Chapter 2 BalaKrishna Inayath Khalil,Glimpse Of Inayath Khalil In KGF Chapter 2,BalaKrishna Neelakantapuram As Inayath Khalil First Look Poster Out,BalaKrishna Neelakantapuram First Look,BalaKrishna Neelakantapuram Look In KGF Chapter 2,BalaKrishna Neelakantapuram's Role From KGF Chapter 2,KGF Chapter 2 New Poster,KGF Chapter 2 Poster,#KGFChapter2

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న కె.జి.యఫ్ 2 సినిమా కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ కరోనా వల్ల లేట్ అయింది. అయితే జూన్ 16న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు కూడా. కానీ మళ్లీ కరోనా సెకండ్ వేవ్ కోరలు చాచడంతో చాలా వరకూ పెద్ద సినిమాలన్నీ మళ్లీ రిలీజ్ డేట్ లు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈనేపథ్యంలో కె.జి.యఫ్ 2 కూడా రిలీజ్ అవుతుందా?లేదా? అన్న డౌట్లు మొదలయ్యాయి. కానీ ఇటీవల కె.జి.యప్ రిలీజ్ చేస్తున్న పోస్టర్లను బట్టి అనుకున్న డేట్ కే వచ్చేలా కనిపిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినిమా రిలీజ్ కు ముందు ఒక్కో క్యారెక్టర్ కు సంబంధించిన పోస్టర్స్ ను రివీల్ చేస్తూ మరింత హైప్ పెంచుతున్నారు. ఇప్పటికే ఈసినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న పలువురు పోస్టర్లను రిలీజ్ చేశారు. రీసెంట్ గానే రావు రమేష్ పోస్టర్ ను కూడా రిలీజే చేశారు. ఈరోజు మరో పోస్టర్ ను రివీల్ చేశారు. ఈ సినిమాలో ఇనాయత్ ఖలీల్ అనే పాత్రలో బాలకృష్ణ అనే నటుడు కనిపించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్. పేపర్ కట్టింగ్స్ తో ఉన్న ఈ పోస్టర్ లో.. ఇనాయత్ ఇండియాలో గుర్తుతెలియని ప్రాంతంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారని క్యాప్షన్ ఉంది. ఇక ఈపోస్టర్ లో కూడా కె.జి.యఫ్ చాప్టర్ 2 జులై 16 నుండే కంటిన్యూ అవ్వబోతున్నట్టు తెలిపారు.

మరి దీన్నిబట్టి ప్రస్తుతానికి అయితే రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదు. అప్పటికల్లా పరిస్థితులు కాస్త సాధారణ స్థితికి వచ్చి.. థియేటర్లు ఓపెన్ అయితే రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారేమో. చూద్దాం మరి చాప్టర్ 2ను చూసే అదృష్టం అంత త్వరగా ఫ్యాన్స్ కు వస్తుందో?లేదో?

కాగా యష్ హీరోగా నటిస్తున్న ఈసినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ చిత్రంలో అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. రవీనాటాండన్ ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తుంది. ప్రకాష్ రాజ్, ఈశ్వరీ రావు కూడా కీలకపాత్రల్లో నటించనున్నారు. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై  నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − eight =