ఇప్పుడున్న కాంపిటీషన్ ను తట్టుకొని సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా రాణించాలంటే అంత ఈజీ కాదు. ఒకప్పుడు హీరోయిన్ ఛాన్స్ రావడం కాస్త కష్టమైనా వచ్చిన తరువాత ఎన్నో ఏళ్లు సినిమాల్లో నటించేవారు హీరోయిన్స్. ఏదో నాలుగైదేళ్లు బిజీ బిజీగా సినిమాలు చేసేశామా అన్నట్టు కాకుండా పది, ఇరవై ఏళ్లు ఏకధాటిగా సినిమాలు చేసేవారు. అప్పట్లో ఎవరి ఇంపార్టెన్స్ వాళ్లకి ఉండేది. ఇక త్రిష, శ్రియ, అనుష్క, కాజల్, సమంత లాంటి హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చి పది పదిహేనేళ్లు దాటిపోయింది. ఇప్పుడు కూడా వారికున్న చరిష్మాతో సినిమాలు చేస్తున్నారు. అయితే అప్పుడున్నంత బిజీగా ఇప్పుడు లేరనుకోండి. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక హీరోయిన్ ఐదేళ్లు సినిమాలు చేస్తే గొప్ప విషయంగా చెప్పుకోవాల్సి వస్తుంది. గ్లామర్ ఒక్కటున్నా సరిపోదు.. అందుకు తగ్గట్టు ఏ పాత్ర అయినా నటించగలిగే సత్తా ఉండాలి.. దానికితోడు కొంచం అదృష్టం కూడా ఉండాలి.. అలా అయితేనే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రేంజ్ ను అందుకోగలరు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు చాలామంది హీరోయిన్స్ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ గా దూసుకుపోతున్నారు. సాయిపల్లవి, రష్మిక మందన్న, కృతి శెట్టి, పూజా హెగ్డే ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఇక వీరిలో సాయి పల్లవి అయితే కాస్త డిఫరెంట్ తను సినిమాలు చేయాలంటే తనకు పాత్ర నచ్చాలి. అందుకే ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఇక రష్మిక అయితే నేషనల్ క్రష్ గానే పేరు తెచ్చుకుంది. పూజాహెగ్డే అయితే బిజీగా ఉన్న హీరోయిన్స్ గా నెంబర్ 1 స్థానంలో ఉంది.. మరోవైపు ఉప్పెనలా వచ్చి ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది కృతి శెట్టి. మరి వీరికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ యంగ్ హీరోయిన్స్ లో మీకు బాగా నచ్చిన హీరోయిన్ ఎవరో మీ ఓటు ద్వారా తెలపండి.
[totalpoll id=”60934″]




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: