ఓవర్సీస్ లోనూ విశ్వనాథ్ & సన్స్ జోరు

Viswanathan & Sons Continues Its Strong Run Overseas

వర్సటైల్ స్టార్ సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వచ్చిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘విశ్వనాథ్ & సన్స్’ ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. నార్త్ అమెరికాలో ఈ చిత్రం వేగంగా 2 మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరి సరికొత్త మైలురాయిని అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూర్య కెరీర్‌లోనే అత్యంత వేగంగా $2M దాటిన చిత్రాల్లో ఒకటిగా నిలవడమే కాకుండా, తమిళం మరియు తెలుగు వర్షన్లలో రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తోంది. కుటుంబ బంధాలు, వినోదం మరియు మాస్ ఎలిమెంట్స్ కలగలిపిన కథ కావడంతో అక్కడ ఉన్న NRIలు, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ అత్యంత భారీగా నిర్మించిన ఈ చిత్రంలో మమితా బైజు,రాధిక ,రవీనా టాండన్ కీలక పాత్రల్లో అలరించగా, జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ అదనపు ఆకర్షణగా నిలిచింది. వీకెండ్ ముగిసినప్పటికీ వర్కింగ్ డేస్‌లో కూడా ఈ రెంజ్‌లో వసూళ్లు రాబడుతుండటంతో లాంగ్ రన్‌లో ఈ సినిమా నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద మరిన్ని భారీ రికార్డులను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.