కరోనా ఫస్ట్ వేవ్ వల్ల సినీ ఇండస్ట్రీ ఎంతో నష్టపోయిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఎంతోమంది సినీ ప్రముఖులు ఫస్ట్ వేవ్ కు బలయ్యారు. ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చింది.. సెకండ్ వేవ్ లో కూడా చాలా మంది సెలబ్రిటీలు కరోనా వల్ల మృతి చెందారు. ఇంకా చాలామంది కరోనా బారిన పడ్డారు. ఇక ఇప్పుడు మరో దర్శకుడికి కూడా సతీ వియోగం కలిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సీనియర్ నిర్మాత, దర్శకుడు తాతినేని ప్రకాశరావు సతీమణి అన్నపూర్ణ ఆదివారం కరోనాతో కన్ను మూశారు. ఆమెకు 91 ఏళ్లు. ఈ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అలనాటి ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు లాంటి దిగ్గజ నటులతోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఎందరో నటీ నటుల చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించిన దర్శకుడు తాతినేని ప్రకాశరావు. కుమారుడు తాతినేని ప్రసాద్ కూడా దర్శకుడే. తెలుగు, హిందీ భాషల్లో ఎన్నో చిత్రాలు నిర్మించారు. అన్నపూర్ణ మనవడు తాతినేని సత్య ప్రకాశ్ కూడా దర్శకుడే. నాని నటించిన `భీమిలీ కబడ్డీ జట్టు` సినిమాతో దర్శకుడిగా పరిచయమై `SMS`, `శంకర`, `వీడెవడు` లాంటి సినిమాలను తెరకెక్కించాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: