ఎంఎస్ రాజు ‘7 డేస్-6 నైట్స్’

Tollywood Producer MS Raju Announces His New Movie 7 Days and 6 Nights,MS Raju,MS Raju Latest News,MS Raju Latest,MS Raju Movies,MS RajuMovie,MS Raju New Movie,MS Raju Latest Movie,MS Raju Upcoming Movie,MS Raju Next Project,MS Raju Upcoming Project,MS Raju New Movie Update,MS Raju New Movie News,MS Raju New Movie Announcement,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,MS Raju Upcoming Movies,Ms Raju's Upcoming Directorial Titled 7 Days 6 Nights,7 Days 6 Nights,7 Days 6 Nights Movie,7 Days 6 Nights Telugu Movie,7 Days 6 Nights Movie Update,7 Days 6 Nights Movie News,MS Raju New Movie 7 Days 6 Nights,MS Raju Latest Movie 7 Days 6 Nights,MS Raju 7 Days 6 Nights,Happy Birthday MS Raju,MS Raju Announced A Film,MS Raju Next 7 Days 6 Nights,MS Raju Confirmed Title For His Next Project,#7Days6Nights,#HBDMSRaju,#HappyBirthdayMSRaju

సుమంత్ అశ్విన్ వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి సినిమాలు నిర్మించబోతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమాకు తండ్రి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించబోతున్నాడని. ఇక కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి 7 డేస్… 6 నైట్స్ టైటిల్ ఫిక్స్ చేశారని కూడా అన్నారు. ఇక నేడు అధికారికంగా టైటిల్ ను ప్రకటించారు. ఎంఎస్ రాజు దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్పతాకంపై తెరకెక్కుతున్న ఈసినిమాకు ‘7 డేస్ 6 నైట్స్’ టైటిల్ ను ఫిక్స్ చేశారు. వింటేజ్ పిక్చర్స్ మరియుఏబిజి క్రియేషన్స్ వారు ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు. దీనికి నిర్మాతలుగా సుమంత్అశ్విన్, రజనీకాంత్ .ఎస్ వ్యవహరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ “ఎన్నో మెగా హిట్ చిత్రాలను నిర్మించిన మా నాన్నగారి సంస్థ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఈ ‘7 డేస్ 6 నైట్స్’ సమర్పిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దర్శకుడిగా మరో భారీ విజయానికి నాన్నగారు శ్రీకారంచుడుతున్నారు. జూన్ 7న చిత్రీకరణ ప్రారంభించాలని అనుకుంటున్నాం. కొంతహైదరాబాద్… మరికొంత గోవా, మంగుళూరు, అండమాన్ నికోబర్ దీవుల్లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం. ‘డర్టీ హరి’తోతన సత్తా చూపించిన నాన్నగారు, మరో విభిన్నమైన జానర్ లో ఈ సినిమాచేయనున్నారు” అని అన్నారు.

ఎంఎస్ రాజు మాట్లాడుతూ “యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేకథతో ఈ సినిమా ఉంటుంది. న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రమిది. సంగీతం, ఇతర సాంకేతిక అంశాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కిస్తాం. గత ఏడాది నా దర్శకత్వంలో వచ్చిన ‘డర్టీ హరి’తో నా జీవితంకొత్త మలుపు తీసుకుంది. ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి, చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ప్రశంసలు మరువలేనివి. చాలామంది పెద్దవాళ్ళు నేను గొప్పగా తీశానని మెచ్చుకున్నారు. నా పుట్టినరోజు సందర్భంగా ‘డర్టీ హరి’కి నాకు అండగా నిలబడి, నన్ను వెన్నంటి ప్రోత్సహించిన నిర్మాత గూడూరు శివరామకృష్ణగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈచిత్రానికి కూడా ఆయన వెన్నంటే ఉంటారు. ‘డర్టీ హరి’ని మించి ఈ సినిమా ఉంటుంది” అని అన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − six =