గ్యాంగ్ స్టర్ కథలతో మూవీస్ తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మ స్టయిలే వేరు. 2002లో చీకటి సామ్రాజ్యాన్ని ఏలిన దావూద్ ఇబ్రహీం – చోటా రాజన్ ల మధ్య పోరు ఆధారంగా ‘కంపెనీ’ అనే సినిమా తెరకెక్కించిన వర్మ ఇప్పుడు స్పార్క్ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ”D కంపెనీ” మూవీ ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ – టీజర్ – ట్రైలర్ ఆసక్తికరంగా ఉన్నాయి. మే 15న స్పార్క్ ఓటీటీలో ‘డి-కంపెనీ’ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రామ్ గోపాల్ వర్మ వాయిస్ ఓవర్ తో “D కంపెనీ” 4 నిమిషాల సినిమాని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ”ఇప్పుడు ముంబై చాలా ప్రశాంతగా ఉంది. కానీ 40 ఏళ్ల క్రితం డి-కంపెనీ కంట్రోల్ లో ఉన్నప్పుడు ఇలా ఉండేది కాదనీ , దావూద్ ఇబ్రహీం ని చాలా స్టడీ చేశాననీ, నేను క్రిమినల్ ని కాదనీ , కానీ చిన్నప్పటి నుంచి క్రిమినల్స్ ని స్టడీ చేయడమంటే నాకు చాలా ఇష్టమనీ , అప్పట్లో గ్యాంగ్ స్టర్స్ అందరూ దావుద్ లాగా ముంబైకి కింగ్ అవ్వాలని కలలు కన్నారనీ , కానీ ఇప్పుడు దావూద్ అనే పేరు ప్రపంచవ్యాప్తంగా తెలిసిందనీ , కానీ ఆ కలలు కన్నవారి పేర్లు పక్కింటి వాళ్ళకి కూడా తెలియదనీ , డి కంపెనీ ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచంలోనే పేరు తెచ్చుకుంది. అంతటి పేరు పొందిన ఆ కంపెనీ 1980లో ఒక అర్థరాత్రి సోనియా బార్ లో..” అంటూ ఆర్జీవీ చెప్పారు. దావూద్ ఇబ్రహీం ఓ చిన్న గ్యాంగ్ లీడర్ నుంచి పెద్ద గ్యాంగ్ స్టర్ గా అండర్ వరల్డ్ ని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడన్నదే ”D కంపెనీ” సినిమాకథ . ఈ 4 నిమిషాల వీడియోకి రామ్ గోపాల్ వర్మ వాయిస్ అదనపు ఆకర్షణగా నిలిచింది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: