థియేటర్స్ మూసివేత పై తలసాని క్లారిటీ

Minister Thalasani Srinivas Yadav Gives Clarity About Movie Theatres In Telangana,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Minister Talasani Srinivas Yadav,Talasani Srinivas Yadav,Talasani Srinivas Yadav Condemns Rumours About Closure Of Theatres,No Closure Of Cinema Halls In Telangana,Talasani Srinivas Yadav Gives Clarity About Closing Theaters,Talasani Srinivas Yadav About Closing Cinema Theaters,Talasani Srinivas Yadav Clarification On Closing Movie Theatres,Talasani Srinivas Yadav Latest Press Meet,Talasani Srinivas Yadav Latest News,Talasani Srinivas Yadav On Movie Theatres,Talasani Srinivas Yadav Press Meet Today,Telngana Movie Theatres,Telangana Cinema Theatres,Cinema Theatres In Telangana,Movie Theatres In Telangana Will Not Be Closed

మళ్లీ కరోనా కేసులు ఎక్కువవడంతో సినిమా ఇండస్ట్రీలో కూడా భయం మొదలైంది. ఎందుకంటే ఇప్పటికే గత ఏడాది మొత్తం షూటింగ్ లు, థియేటర్లు లేక సినీ ఇండస్ట్రీ ఎంతో నష్టపోయింది. రెండు మూడు నెలల క్రితమే థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. అందులోనూ ఇప్పుడిప్పుడే కాస్త థియేటర్లకి జనాలు వస్తున్నారు. మరోవైపు పెండింగ్ లో ఉన్న సినిమాలను కూడా వరుసపెట్టి రిలీజ్ చేసేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. ఒక్కో వారం రెండు, మూడు సినిమాలు రిలీజవుతున్నాయి. అయితే కరోనా కేసులు పెరుగుతుండటంతో మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి వస్తుందేమో అని భయపడుతున్నారు. ఇప్పటికే స్కూల్స్, కాలేజీలు మూసేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌నూ మూసేస్తార‌న్న వార్తలు వస్తున్నాయి. లేకపోతే ఆక్యుపెన్సీ అయినా తగ్గిస్తారు అంటున్నారు. దీనిపై తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ స్పందించారు. థియేట‌ర్ల‌ని మూసేసేలా నిర్ణ‌య‌మేదీ తీసుకోలేద‌ని, అవ‌న్నీ పుకార్లే అని వాటిని న‌మ్మొద్ద‌ని స్ప‌ష్టం చేశారు. కరోనా స‌మ‌యంలో చిత్ర‌సీమ బాగా న‌ష్ట‌పోయింద‌ని, వాళ్ల అవ‌స‌రాల్ని తెలుసుకుని, స‌మ‌స్య‌లు తీర్చే విధంగా తెలంగాణ ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని మంత్రి పేర్కొన్నారు. కోవిడ్ నిబంధ‌న‌ల్ని దృష్టిలో ఉంచుకుని థియేట‌ర్ల‌ను న‌డుపుకోవొచ్చ‌ని సూచించారు. మొత్తానికి ఈక్లారిటీతో చిత్రపరిశ్రమకు కాస్త ఊరట లభించినట్టే.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − seven =