బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘‘అక్షర’’. సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సురేష్ వర్మ అల్లూరి,అహితేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈరోజు ‘‘అక్షర’’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది . మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకూ ఆకట్టుకుందో తెలియాలంటే మాత్రం రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు : నందిత శ్వేత, శకలక శంకర్, అజయ్ ఘోష్, మధునందన్, సత్య, హర్షవర్థన్ తదితరులు
డైరెక్టర్ : బి. చిన్నికృష్ణ
బ్యానర్ : సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్
నిర్మాత : అల్లూరి సురేశ్ వర్మ, అహితేజ బెల్లంకొండ
సంగీతం : సురేశ్ బొబ్బిలి
సినిమాటోగ్రాఫర్ : నరేశ్ బానెల్లి
కథ:
అక్షర (నందిత శ్వేత) విద్యా విధాన్ అనే ప్రైవేట్ విద్యా సంస్థలో ఫిజిక్స్ లెక్చరర్ గా పనిచేస్తుంది. ఇక అదే కాలేజీకి బోర్డ్ డైరెక్టర్‌గా ఉన్న శ్రీతేజ్ (శ్రీతేజ్) అక్షరను ప్రేమిస్తాడు. మరోవైపు వాల్తేర్ బాయ్స్ (మధు నందన్, సత్య, శంకర్లు) ఒకరి తెలియకుండా ఒకరు ఆమెను ప్రేమిస్తుంటారు. ఆమె ఇష్టాయిష్టాలను తెలుసుకొని వాటిని ఫాలో అవుతూ అక్షరను ఇంప్రెస్ చేసే పనిలో ఉంటారు. ఒక రోజు శ్రీతేజ్ తన మనసులో మాటను చెప్పేలోపు అక్షర శ్రీతేజ్‌ను కాల్చేస్తుంది. అంతే కాకుండా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు ఆఫీసర్‌ను కూడా అక్షర చంపేస్తుంది. అసలు శ్రీతేజ్‌ని అక్షర ఎందుకు చంపేసింది? అసలు అక్షర ఫ్లాష్‌బ్యాక్ ఏంటి? విద్యా విధాన్ ప్రైవేట్ సంస్థల యజమాని సంజయ్ స్వరూప్ అంటే అక్షరకు ఎందుకు కోపం? అన్నదే మిగతా కథ
విశ్లేషణ:
పరీక్షల్లో ర్యాంకులు రాలేదని.. ఫెయిల్ అయ్యారని… ఒత్తిడులను తట్టుకోలేక ఎంతోమంది స్టూడెంట్స్ చనిపోవడం మనం ఎన్నో ఘటనలు చూశాం. చూస్తూనే ఉన్నాం. ఇదే పాయింట్ ను హైలైట్ చేసి చిన్నికృష్ణ అక్షర రూపంలో సినిమా తీశాడు. ప్రైవేట్ విద్యా సంస్థల ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు? ర్యాంకులు, మార్కుల కోసం కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థుల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారో చూపించిన చిత్రమే అక్షర. దానికి కొంత కామెడీ, కొంత ఎమోషన్, కొంత ఇన్వెస్టిగేషన్, కొంత రివైంజ్ డ్రామా యాడ్ చేశాడు.
ఫస్టాఫ్ మొత్తం కామెడీతో నడిపించిన దర్శకుడు ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్‌పై ఆసక్తి కలిగించేలా చేశాడు.చివరి అరగంటలో వచ్చే సన్నివేశాలను సినిమాకు చాలా ప్లస్. హర్షవర్థన్ చెప్పే సంభాషణలు ప్రతి ఒక్కరిని ఆలోచించే విధంగా చేస్తాయి. విద్యావ్యవస్థలో ఉన్న లోపాలను చక్కగా చూపించారు.
ఇక ఈసినిమాకు హైలెట్ నందిత శ్వేత. ఈసినిమాలో ఆమె లాగ మరెవరూ చేయలేరు అన్నట్టుగా నటించింది. అక్షర అనే లెక్చరర్ పాత్రలో ఆమె ఒదిగిపోయారు. ఎమోషనల్ సీన్లను కూడా బాగా పండించింది. ఇక విద్యా విధాన్ విద్యా సంస్థల అధినేతగా సంజయ్ స్వరూప్ తన పరిధి మేరకు నటించారు. హర్షవర్ధన్ నటన బాగుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
ఫైనల్ గా సామాజిక బాధ్యత అంశంగా వచ్చే సినిమాలను ఆదరించే ప్రేక్షకులకు అక్షర సినిమా తప్పకుండా నచ్చుతుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































