ప్రభాస్ సినిమా అప్ డేట్ పై నాగ్ అశ్విన్ క్లారిటీ

Nag Ashwin Promises To Give Updates About His Movie With Rebel Star On These Two Dates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Prabhas21,Director Nag Ashwin,Deepika Padukone,Actress Deepika Padukone,Prabhas,Rebel Star Prabhas,Hero Prabhas,Actor Prabhas,Prabhas21 Two Updates Soon,Prabhas21 Two Updates,Prabhas21 Latest Updates,Prabhas21 Latest News,Director Nag Ashwin Prabhas21 Update,Nag Ashwin Promises Two Updates Soon,Prabhas 21 Movie Update,Prabhas 21 Movie News,Nag Ashwin New Movie,#Prabhas21

నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. అయితే ఎంత సేపు రాధే శ్యామ్.. ఆదిపురుష్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ తప్పా ఈ సినిమా గురించి పెద్దగా అప్ డేట్స్ వచ్చిన దాఖలాలు లేవు. ఇక సంక్రాంతికి కూడా ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంక్రాంతి పండుగ తర్వాత తమ చిత్రానికి సంబంధించి ఓ ప్రత్యేకమైన అప్‌డేట్‌ ఇస్తానని నాగ్‌అశ్విన్‌ చెప్పాడు. కానీ చిత్రయూనిట్ నుండి ఎలాంటి అప్ డేట్ రాలేదు. మరి మాములుగానే అప్ డేట్స్ ఇవ్వకపోతే అభిమానులు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఆడుకుంటారు.. అలాంటిది అప్ డేట్ ఇస్తామని చెప్పి ఇవ్వకపోతే ఇంకెలా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వకపోవడంతో నెటిజన్లు ట్విటర్‌ వేదికగా వరుస ట్వీట్లు చేస్తున్నారు. దీంతో ఈ ట్వీట్ లపై స్పందించిన నాగ్‌ అశ్విన్‌.. ‘జనవరి 29న కానీ ఫిబ్రవరి 26న కానీ కచ్చితంగా అప్‌డేట్‌ ఉంటుంది’ అని సమాధానమిచ్చారు. మరి చూద్దాం ఏం అప్ డేట్ ఇస్తారో..

ఇక బాలీవుడ్ హీరోయిన్ గా దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. ఈ సినిమా కోసం మరో లెజెండ్రీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కూడా మెంటర్ గా పని చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.