గిరి దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘బంగారు బుల్లోడు’. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. జనవరి 23వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న అల్లరి నరేష్ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ఈ సినిమాలో నేను బంగారు ఆభరణాలు తయారుచేసే గోల్డ్‌స్మిత్ పాత్రలో కనిపిస్తాను. ఓ గ్రామీణ బ్యాంకులో బంగారు తాకట్టు విభాగంలో పనిచేస్తూ ఆభరణాల నాణ్యత ఏమిటో నిర్ధారించడం నా పని. ఈ సినిమాలో తనికెళ్ల భరణిగారు నాకు తాత పాత్రలో కనిపిస్తారు. షూటింగ్ టైమ్‌లో ఆయన ‘గోల్డ్‌స్మిత్ పాత్ర కోసం ఆ విద్య గురించి కొంచెం తెలుసుకుంటే మంచిది’ అని సూచించారు. దాంతో ఈ సినిమా కోసం బంగారానికి మెరుగులుదిద్దడం, అతుకులు వేయడం వంటి పనుల్ని నేర్చుకున్నా అంటూ తెలిపాడు.
కాగా పూజా ఝవేరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, ప్రవీణ్, సత్యం రాజేశ్, ప్రభాస్ శ్రీను, జబర్దస్త్ మహేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతమందిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























